INDvsSA | సౌత్‌ఆఫ్రికా వెళ్లే టీమిండియా టెస్ట్ జట్టు ఇదే.. వైస్ కెప్టెన్ వచ్చేశాడు..!

INDvsSA

INDvsSA | సౌతాఫ్రికా వెళ్లే టీమిండియా జట్టును ప్రకటిచింది బీసీసీఐ. మొత్తం 18 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును సౌతాఫ్రికాలో టెస్టులు ఆడేందుకు ఎంపిక చేసినట్లు బుధవారం తెలిపింది. ఈ మేరకు జట్టు సభ్యుల వివరాలను వెల్లడిచింది. న్యూజిల్యాండ్ టెస్టులో పేలవ ప్రదర్శనతో ఆకట్టుకోలేకపోయినా.. ఆజింక్య రహానే, చతేశ్వర్ పుజారాలకు మరో అవకాశం కల్పించింది బీసీసీఐ.
అలాగే కివీస్‌తో అదరగొట్టిన శ్రేయస్ అయ్యర్, మయాంక్ అగర్వాల్‌లను కూడా ఎంపిక చేసింది. అలాగే కివీస్‌తో 3 టీ20ల సిరీస్‌లో కెప్టెన్‌గా..3-0తో సిరీస్ గెలిపించిన రోహిత్ శర్మ టెస్టులకు రెస్ట్ తీసుకున్నాడు. అయితే ఇప్పుడు సౌతాఫ్రికా టెస్టుకు మాత్రం అతడిని ఎంపిక చేసింది బీసీసీఐ.
ఈ జట్టకు వైస్ కెప్టెన్‌ను కూడా చేసింది. అంటే కోహ్లీ కెప్టెన్సీలో రోహిత్ వైస్ కెప్టెన్‌గా టీమిండియా బరిలోకి దిగనుందన్నమాట. ఇక కివీస్‌తో టెస్ట్ సిరీస్‌కు గాయం కారణంగా దూరమైన రాహుల్ తిరిగి జట్టులోకొచ్చాడు. అయితే అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్‌లు మాత్రం ఈ జట్టులో లేరు.
జట్టు:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, ఆజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరీజ్, ఉమేశ్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమి.
స్టాండ్ బై:
నవదీప్ సైనీ, సౌరభ్ కుమార్, దీపక్ చాహర్, అర్జాన్ నాగ్వస్‌వల్ల.
కాగా.. ఈ సిరీస్ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. ముందుగా అనుకున్న ప్రకారం అయితే ఈ నెల 17 నుంచే ప్రారంభం కావల్సి ఉన్నా.. కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బయటపడడంతో సిరీస్ వాయిదా పడింది.
అయితే అన్ని అడ్డంకులను అధిగమించి 26వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అయితే టీ20 సిరీస్‌ను మాత్రం వాయిదా వేసింది.
#TeamIndia #ViratKohli #RohitSharma #INDvsSA