
INDvsNZ

INDvsNZ | ఐదేళ్ల తర్వాత తొలిసారి వాంఖడేలో టెస్ట్ మ్యాచ్ జరగబోతోంది. తొలి మ్యాచ్‌లో ఒక్క వికెట్ తేడాతో విజయానికి దూరమైన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది.
అటువైపు న్యూజిల్యాండ్ కూడా టీ20 సిరీస్ పరాభవాన్ని టెస్ట్ సిరీస్‌లో గెలిచి పోగొట్టుకోవాలని చూస్తోంది. ఇలాంటి టైంలో ఐదేళ్లుగా టెస్ట్ సిరీస్‌కు ఆతిథ్యం ఇవ్వని వాంఖడేలో ఈ మ్యాచ్ జరగబోతుండడం సర్వత్రా ఆసక్తి జరగబోతోంది.
2016లో చివరిగా వాంఖడేలో టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి జట్టులోకి తిరిగిరానున్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని టీమిండియా ఆసక్తిగా ఉంది.

అయితే ఈ పిచ్ బ్యాటింగ్‌కు సహకరిస్తుందా..? బౌలింగ్‌కు సహకరిస్తుందా..? ఇక్కడ భారత్ గెలవాలంటే ఏం చేయాలి..? ఇంతకుముందు ఈ పిచ్ ఎవరెవరు ఎలాంటి రికార్డులు నమోదు చేశారు..? ఇప్పుడు చూద్దాం.
వాంఖడే పిచ్ ఎవరికి ప్లస్..?:
ముంబైలోని పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. అలాగే పేస్ బౌలర్లకు కూడా సహకరిస్తుంది. ఈ పిచ్‌లో టీమిండియా ఆడిన చివరి టెస్టులో టీమిండియా ఇంగ్లండ్‌తో పోటీపడింది.
ఈ మ్యాచ్‌లో ఓ ఇన్నింగ్స్‌లో 631 పరుగులు చేయడమే కాకుండా.. ఇన్నింగ్స్ 36 పరుగుల తేడాతో ప్రత్యర్థిని మట్టి కరిపించింది.

ఈ మ్యాచ్‌లో ఇంగ్లీష్ ఆటగాడు.. కీటన్ జెన్నింగ్స్ సెంచరీతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసింది. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లి డబుల్ సెంచరీ, మురళీ విజయ్, జయంత్ యాదవ్ సెంచరీలు చేయడంతో భారత్ 631 పరుగుల స్కోరును నమోదు చేసింది.
ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లతో ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్‌ను బెంబేలెత్తించాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 195 పరుగులకే ఆలౌట్ అయింది.

పిచ్ రిపోర్ట్:
ఇప్పటివరకు ఈ పిచ్‌పై 25 టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. అలాగే ఇక్కడ భారత్ 11 మ్యాచ్‌లు గెలిచింది. అలాగే ప్రత్యర్థులు 7 సార్లు గెలిచారు. అలాగే 7 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
ఇక్కడ అత్యధిక స్కోరు 631. 2016లో ఇంగ్లండ్‌పై భారత్ చేసింది. అత్యల్ప స్కోరు 93. 2004లో భారత్‌పై ఆస్ట్రేలియా చేసింది.
అలాగే ఇక్కడ అత్యధికంగా టెస్టుల్లో ఛేదించిన స్కోరు 164/6. 2000 సంవత్సరంలో భారత్‌పై సౌత్‌ఆప్రికా చేసింది.

ఇక ఈ పిచ్‌పై ఓ బ్యాట్స్‌మన్ చేసిన అత్యధిక స్కోరు 242 నాటౌట్. 1975లో భారత్‌పై విండీస్ దిగ్గజం క్లైవ్ లాయిడ్ చేశాడు. అలాగే ఓ ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఘనత టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్బజన్ సింగ్ పేరిట ఉంది.
బెస్ట్ బౌలింగ్:
హర్బజన్ 2002లో వెస్టిండీస్‌పై 48 పరుగులిచ్చి 7 వికెట్లు తీశాడు. ఇక మొత్తం మ్యాచ్ పరంగా చూస్తే 1980లో ఇండియాపై ఇయాన్ బోథమ్.. 106 పరుగులిచ్చి 13 వికెట్లు తీశాడు. ఇక్కడ బ్యాటింగ్‌లో అత్యుత్తమ రన్ రేట్ 2.92.
ఇక ఈ పిచ్‌పై టీమిండియా, న్యూజిల్యాండ్ 2సార్లు పోటీ పడితే.. అందులో ఇండియా -1, న్యూజిల్యాండ్-1 గెలిచాయి. డ్రా-0 గా గణాంకాలు నమోదయ్యాయి.