
Indonesia Open

Indonesia Open | ఇండోనేషియా ఓపెన్ 2021లో భారత పోరు ముగిసింది. భారత్ తరపున పోటీల్లో పాల్గొన్న ఆరో సీడ్ ఆటగాళ్లు సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టిల పోరాటం ముగిసింది. శనివారం జరిగిన సెమీఫైనల్ పోటీల్లో టాప్ సీడ్ మార్కస్ ఫెర్నాంల్డి గిడియన్, కెవిన్ సంజయ సుకముల్‌జోల చేతిలో పరాజయం చవి చూశారు.
ఈ ఓటమితో టోర్నీలో ఇండియా పోరాటం ముగిసింది. మ్యాచ్ ప్రారంభం నుంచి భారత ఆటగాళ్లు వెనుకబడే ఉన్నారు. దీంతో కేవలం 44 నిముషాల్లోనే 21-16, 21-18 తేడాతో సాత్విక్, చిరాగ్ ఓటమి చవి చూశారు. ఇదిలా ఉంటే కెవిన్, గిడియన్‌ల చేతిలో సాత్విక్, చిరాగ్‌లు ఓడిపోవడం ఇది వరుసగా రెండోసారి.

ఇదిలా ఉంటే స్టార్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధూ కూడా కొద్ది రోజుల క్రితమే ఓటమి పాలైంది. ఇక ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 750 టోర్నీలో తొలి మ్యాచ్‌లో ఒహోరి (జపాన్), లీ (జర్మనీ), యుజిన్ (కొరియా) లపై గెలిచి సెమీఫైనల్ చేరింది సింధు.
కానీ ఫైనల్‌లో మాత్రం పరాజయం పాలైంది. థాయ్‌ల్యాండ్‌కు చెందిన సెకండ్ సీడ్ షట్లర్ ఇంతానన్ రచనోక్ చేతిలో ఓడి ఇంటి దారి పట్టింది.