

‘లేచింది.. నిద్ర లేచింది మహిళా లోకం… దద్దరిల్లింది పురుష ప్రపంచం…’ అంటూ అప్పుడెప్పుడో ఎన్టీఆర్ చెప్పిన మాట గుర్తుందా? ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇదే విధానం కనిపిస్తోంది. అన్ని రంగాల్లో మహిళలు తమ సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో ఎన్నో ఘనతలు సాధిస్తున్నారు. స్వదేశంలోనే కాదు, విదేశాల్లోనూ రాణిస్తూ భారత కీర్తిని నలుమూలలకు వ్యాపింపజేస్తున్నారు.
తాజాగా కెనడా దేశంలో అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితా విడుదలైంది. ఈ జాబితాలో పలువురు భారత సంతతి మహిళలకు చోటు దక్కింది. వీరిలో అనితా ఆనంద్ ఒకరు. ఆమె కెనడా దేశ రక్షణ శాఖ మంత్రిగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. ఓక్‌విల్లే ప్రాంతం నుంచి ఆమె పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా ప్రెసిడెంట్ జస్టిన్ ట్రూడో కేబినెట్2లో మంత్రి పదవి దక్కించుకున్నారు.
Accident | షాపింగ్‌కు చేసి వస్తూ.. అమెరికాలో తెలుగు యువకుడు దుర్మరణం!
ఈ ఘనత సాధించిన తొలి హిందూ మహిళగా చరిత్ర సృష్టించారు. ఆమె తల్లి పంజాబ్‌కు చెందిన సరోజ్ దౌలత్ రామ్, తండ్రి తమిళనాడుకు చెందిన డాక్టర్ సుంద్ వివేక్ ఆనంద్. ఆమె ఒక్కతే కాదు. కెనడాలోని 100 మంది అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో మరికొందరు భారత సంతతి స్త్రీలు చోటు సంపాదించుకున్నారు.
నిర్మాత, నటి శ్రేయా పటేల్ కూడా ఈ లిస్టులో ఉన్నారు. అంటారియో హెల్త్ అండ్ పవర్ జనరేషన్ బోర్డ్ మెంబర్ అంజు విర్మణి, ఎస్టీఈఎం మైండ్ కార్ప్ వ్యవస్థాపకురాలు అను బిదానీ, స్మార్ట్ వీల్‌చైర్స్ స్టార్టప్ బ్రేజ్ మొబిలిటీ ఫౌండర్ డాక్టర్ పూజా విశ్వనాథన్, బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీకి చెందిన అనన్య ముఖర్జీ రీడ్, టీఈఎల్‌యూఎస్ వ్యవస్థాపకురాలు భన్వీ సచ్‌దేవా, సర్రే హాస్పిటల్స్ ఫౌండేషన్ సీవోవో అజ్రా హుస్సేన్, ప్లాన్ ఇంటర్నేషనల్ కెనడా సూపర్‌వైజర్ లావణ్య హరిహరన్ కూడా 100 మోస్ట్ పవర్‌ఫుల్ వుమెన్ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
1 thought on “Indian Origin Women | కెనడాలోని శక్తిమంతమైన మహిళల్లో.. భారత సంతతి స్త్రీలు”