

ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ గుక్కి.. ఒక భారత సంతతి యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఆ కంపెనీకి చెందిన బ్యాగ్ ఉండటంతో అతన్ని కొందరు దుండగులు పొడిచి చంపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బ్రిటన్ రాజధాని లండన్‌లో అష్మీత్ సింగ్ అనే 16 ఏళ్ల సిక్కు యువకుడు నివసిస్తున్నాడు. అతను పశ్చిమ లండన్‌లో రోడ్డుపై వెళ్తుండగా కొందరు దుండగులు అష్మీత్‌ను సమీపించారు.
అతని వద్ద ఉన్న గుక్కి బ్యాగ్ తమకు ఇచ్చేయాలని, లేదంటే చంపేస్తామని బెదిరించారు. అష్మీత్ ప్రతిఘటించడంతో ఆగ్రహం తెచ్చుకున్న వాళ్లు.. అష్మీత్‌ను కత్తితో పొడిచేశారు. అయితే ఈ హత్యకు కారణమైన గుక్కి బ్యాగ్ నకిలీదని తేలింది. ఈ ఘటనలో సిక్కు యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ ఏడాది లండన్‌లో ఇలా నడిరోడ్డుపై ఒకరిని హత్య చేయడం ఇది 28వ సారి అని అధికారిక గణాంకాలు చెప్తున్నాయి.