Imran Khan | ఇమ్రాన్ ఖాన్ పరువు పాయే.. ఎంత అవమానం..!

Imran Khan

Imran Khan | ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోవడం, ఆర్థికంగా సంక్షోభంలోకి జారుకుంటుండడంతో పాకిస్తాన్‌పై ఆ దేశ ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలో ఇమ్రాన్ ఖాన్ వైఫల్యాలను ఎండగడతూ ఓ పేరడీ పాట రూపొందించారు పాకిస్తాన్‌కు చెందిన కొంతమంది.
ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. ఈ పాటను సెర్బియా పాకిస్తాన్ దౌత్య కార్యాలయం తమ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.
ఈ పెరడీ వీడియో పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. ఈ వీడియోను సెర్బియాలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం తన ట్విటర్‌లో షేర్ చేసింది.
దాయాది దేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు గత మూడు నెలల నుంచి జీతాలు చెల్లించలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక పాక్, ఉగ్రవాదులకు అత్యంత సురక్షిత ప్రాంతంగా ప్రపంచదేశాల భావిస్తున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్‌ను ఆర్థికంగా ఆదుకోవడానికి ఏ దేశం ముందుకు రావడం లేదు.
మరోవైపు డ్రాగన్ తన స్వార్థ ప్రయోజనాల కోసం పాక్‌కు రుణం ఇస్తోంది కానీ.. అవి ఆ దేశ అవసరాలను తీర్చడం లేదు.
మరి కొన్ని నెలలు పరిస్థితి ఇలానే కొనసాగితే.. పాకిస్తాన్ ప్రభుత్వంలో భారీ మార్పుల చోటు చేసుకుంటాయి.
‘సబ్బు ధర పెరిగిందా.. వాడొద్దు.. పిండి ఖరీదు ఎక్కువైందా..? తినవద్దు.. ఔషధాల ధరలు పెరిగాయా.. అయితే ఆస్పత్రులకు వెళ్లొద్దు. పన్నుల చెల్లించి.. హాయిగా నిద్రపోండి.
మీ పిల్లలకు తిండి, తిప్పలు, చదువు లేకపోయినా ఇబ్బందేమీ లేదు. పాకిస్తాన్ ఎప్పటికి మేల్కొదు’ అంటూ సాగుతుంది ఈ పాట.
‘పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణంలో గత రికార్డులను బద్దలు కొడుతోందని, ఇమ్రాన్ ఖాన్.. ఇంకా ఎంత కాలం ప్రభుత్వ అధికారుల మీరు చెప్పినట్లు మారు మాట్లాడకుండా పని చేయాలని అనుకుంటున్నారు.
3 నెలలుగా జీతాలు లేవు. ఫీజు కట్టక మా పిల్లలను పాఠశాల నుంచి పంపించేస్తున్నారు. ఇంకెంత కాలం ఈ మొద్దు నిద్ర నటిస్తారు. ఇదేనా కొత్త పాకిస్తాన్’ అనే క్యాప్షన్‌తో ఈ పెరడీ పాట షేర్ అవుతోంది.
ఈ వీడియోను షేర్ చేసిన కొద్ది సేపటికే విపరీతంగా వైరల్ కావడంతో.. అధికారులు వెంటనే దీనిని తొలగించారు. తమ ఖాతా హ్యాక్ అయిందని, ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలన్నీ హ్యాక్ అయ్యాయని సెర్బియా పాక్ దౌత్య కార్యాలయం తెలిపింది.
తాజాగా పోస్ట్ అయిన సందేశాలతో తాము చేసినవి కావని వివరణ ఇస్తూ ప్రకటన విడుదల చేసింది.
కానీ పాక్‌లోని కొంతమంది మాత్రం హ్యాక్ అయిందనే మాట అబద్ధమని, వాళ్లే పోస్ట్ చేశారని అంటున్నారు.
#ImranKhan #Pakistan #ParodySong #VIralVideo