

ICC | అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో కొత్త రూల్స్ ని ప్రకటించింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ). ఇకపై పురుషుల, మహిళల అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లలో స్లో ఓవర్ రేట్ పెనాల్టీ విధానాన్ని పరిచయం చేసింది ఐసీసీ. అలాగే డ్రింక్స్ బ్రేక్ కూడా ఆప్షనల్ గా అందించబోతోంది. ఈ రూల్స్ అన్నీ ఈ నెల నుంచి అమలులోకి రాబోతున్నాయి.
స్లో ఓవర్ రేట్ రూల్స్ ని ఐసీసీ 13.8 క్లాస్ లో వివరించింది. దాని ప్రకారం.. ఫీలసింగ్ చేస్తున్న జట్టు నిర్ణీత సమయంలోపు ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ తొలి బంతి వేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఒకవేళ ఏ జట్టైనా అలా లేని పక్షంలో 30 యార్డ్స్ సర్కిల్ బయట ఉండే ఫీల్డర్స్ లో ఒక్కరిని లోపలికి తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మిగిలిన ఓవర్లన్నీ తక్కువ ఫీల్డర్ తోనే వేయాల్సి ఉంటుంది.

ఇది మాత్రమే కాకుండా ఐసీసీ రూల్ బుక్ లోని ఆర్టికల్ 2.2 ప్రకారం.. ఇంతకు ముందు ఉన్న స్లో ఓవర్ రేట్ పెనాల్టీలు కూడా చెల్లించాల్సిందే.
అలాగే మ్యాచ్ మధ్యలో 2:30 నిముషాల డ్రింక్స్ బ్రేక్ తీసుకోవచ్చు. అయితే ఎప్పుడు బ్రేక్ తీసుకోవాలని విషయంపై మ్యాచ్ ముందే ఇరు జట్లు ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. దాని ప్రకారమే బ్రేక్ తీసుకోవాలి.
ఇక ఈ కొత్త రూల్స్ ప్రకారం ఆడబోయే మొదటి మ్యాచ్ వెస్టిండీస్, ఐర్లాండ్ మధ్య జరగబోతోంది. జనవరి 16న జమైకాలోని సబీనా పార్క్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది.
#ICC #Cricket #NewRules #Westindies #Ireland #Penalty #T20I