

Horrifying | ప్రస్తుత కరోనా కాలంలో శానిటైజర్ అనేది నిత్యావసరంగా మారింది. ఇంటి నుంచి బయటకు వెళ్లినా, బయటి నుంచి ఇంటికి వచ్చినా శానిటైజేషన్ తప్పనిసరిగా మారింది. ఈ క్రమంలో ఒంటినిండా శానిటైజర్ కొట్టుకోవడం ఒక వ్యక్తి ప్రాణాలను బలిగొంది.
ఈ ఘటన అమెరికాలో వెలుగు చూసింది. జేసన్ జోన్స్ అనే 29 ఏళ్ల వ్యక్తి న్యూయార్క్‌లోని ఒక జైల్లో ఉన్నాడు. మద్యం మత్తులో ఉన్నాడేమో లాబీలో తూగుతూ తిరిగిన అతను.. అక్కడ శానిటైజర్ కనిపించగానే టీషర్టు తీసేశాడు.
ఒంటి నిండా శానిటైజర్ కొట్టుకున్నాడు. తలపై కూడా శానిటైజర్ పోసుకుంటూ పోలీసుల వైపు వచ్చాడు. అతన్ని ఆపడానికి ప్రయత్నించిన పోలీసుల్లో ఒక వ్యక్తి.. తన వద్ద ఉన్న టేజర్ (ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చే పరికరం) తీసి జేసన్‌కు గురిపెట్టాడు.
అతన్ని సముదాయించడానికి ప్రయత్నించాడు. కానీ జేసన్ ప్రవర్తనలో మార్పు కనిపించకపోవడంతో టేజర్ ఉపయోగించాడు. అప్పటికే శానిటైజర్‌లో తడిసి ఉన్న జేసన్ శరీరం.. టేజర్ తగలగానే మంటలు అంటుకుంది.
ఈ దృశ్యం చూసిన పోలీసు అధికారులు.. వెంటనే అక్కడి నుంచి బయటకువ వెళ్లిపోయారు. ఆ మంటలు కొంచెం తగ్గగానే లోపలకు వచ్చిన అధికారులు.. జేసన్‌కు బేడీలు వేసేందుకు ప్రయత్నించారు.

అయితే ఆ తర్వాత లోపలకు వచ్చిన ఒక వ్యక్తి జేసన్‌ను కౌగిలించుకొని సముదాయించాడు. ఆ తర్వాత అంబులెన్సులో అతన్ని ఆస్పత్రికి తరలించారు. అక్కడ 6 వారాలపాటు చికిత్స ఇచ్చిన అనంతరం.. చివరకు జేసన్ లైఫ్ సపోర్ట్ తొలగించారు.
ఈ మరణంలో పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయిన కారణంగా ప్రత్యేక దర్యాప్తునకు న్యూయార్క్ కోర్టు ఆదేశించింది. అలాగే ఈ ఘటనకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది.
# USA# America# Shocking,