

Keerthy Suresh | మహానటి కీర్తి సురేష్ విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులకు ఆకట్టుకుంటుంది. ఎప్పటికప్పుడు కొత్త తరహా కథలతో అందరిని అలరిస్తోంది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. అయితే కొంత కాలం క్రితం కీర్తి లీడ్ రోల్‌లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన మూవీ ‘గుడ్ లక్ సఖి’ రిలీజ్ లేట్ అవుతూ వస్తోంది.
ఈ సినిమాలో కీర్తి షూటర్‌గా కనిపించనుంది. ముందుగా ఓ పల్లెటూరి అమ్మాయిగా కనిపించిన కీర్తి ఆతరువాత షూటర్‌గా ఎలా మారిందనేదే కథ. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
అయితే తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాను జనవరి 28న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వారు ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో కీర్తి బాణమేస్తూ కనిపిస్తోంది.
కీర్తి సురేశ్ వెనుక జగపతి బాబు, ఆది పినిశెట్టి, రాహుల్ రామకృష్ణ కూడా ఉన్నారు. మరి ఈ సినిమాతో కీర్తి అభిమానులను ఏమాత్రం ఆకట్టుకుంటుందో తెలియాలంటే జనవరి 28 వరకు వేచి చూడాల్సిందే.
#KeerthiSuresh #AadhiPinisetty #GoodLuckSakhi #JagapathiBabu