
_1639654333047_1639654343889.jpg?w=640&ssl=1)
Virat kohli | బీసీసీఐతో గత కొద్ది రోజులుగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి చెడిందనే వార్తలు వస్తున్నాయి. టీ20 కెప్టెన్సీ వదిలేయడం, తర్వాత వన్డే కెప్టెన్‌గా కోహ్లీని బీసీసీఐ తొలగించడం, తాజాగా టెస్ట్ కెప్టెన్సీ నుంచి కూడా కోహ్లీ హఠాత్తుగా తప్పుకోవడం అన్నీ ఈ వార్తలకి బలం చేకూరుస్తున్నాయి. అయితే తాజాగా మరో షాకింగ్ విషయం బయటకొచ్చింది.
అదేంటంటే.. డిసెంబర్‌లో కోహ్లీ నిర్వహించిన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ విషయంలో గంగూలీకి విపరీతంగా కోపం వచ్చిందట. ఆ కోపంలోనే విరాట్ కోహ్లీకి బీసీసీఐ తరపున షోకాజ్ నోటీసులు కూడా పంపించాలని గంగూలీ అనుకున్నారట.
కానీ సెక్రెటరీ జై షా కల్పించుకుని గంగూలీకి సర్ది చెప్పారట. దీంతో నోటీసులు ఇవ్వాలనే ఆలోచన గంగూలీ విరమించుకున్నారట.

టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకున్న తర్వాత, వన్డే కెప్టెన్సీ నుంచి కూడా కోహ్లీని తప్పించింది బీసీసీఐ. అయితే తనను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు తనకు కూడా చెప్పలేదని కోహ్లీ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పాడు.
అయితే ఆ తర్వాత గంగూలీ మీడియాతో మాట్లాడుతూ.. ముందుగా కోహ్లీని టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని కోరామని, కానీ కోహ్లీ వినిపించుకోలదని గంగూలీ చెప్పాడు. టీ20, వన్డేలకు వేరు వేరు కెప్టెన్లు ఉండకూడదనే వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తొలగించామని వివరించాడు.
దీంతో మళ్లీ మీడియా ముందుకొచ్చిన కోహ్లీ.. తనకు టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని గంగూలీ కానీ, బీసీసీఐ అధికారులు కానీ కోరలేదని చెప్పుకొచ్చాడు. కోహ్లీ ఇలా చెప్పడమే గంగూలీ కోపానికి కారణమని తెలుస్తోంది.
#ViratKOhli #SouraGanguly #BCCI #Notice