

Uttar Pradesh | మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఓ నిందితుడిని కోర్టు బయటే కాల్చి చంపేశాడు ఓ ఆర్మీ అధికారి. పోలీసు బలగాలు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా అతడిని కాల్చి చంపాడు. దాంతో అక్కడి వారంతా షాకైపోయారు.
వెంటనే తేరుకున్న పోలీసులు ఆ జవానును అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్‌పూర్‌లోని కలెక్టరేట్ దగ్గర చోటుచేసుకుంది. అయితే మరణించిన వ్యాక్తి పోక్సో కేసులో నిందితుడని, అతడు ముజఫార్‌పుర్ నివాసి దిల్‌షద్ హుస్సేన్‌గా పోలీసులు గుర్తించారు.
కోర్టులో పోక్స్ చట్టం కింద కేసు నడుస్తోందని, అందులో ఇరు వర్గాల వారు హాజరయ్యారని పోలీసులు తెలిపారు. మైనర్ బాలికను రేస్ చేసిన కేసులో నిందితుడిని బాధితురాలి తండ్రి మాజీ జవాను కోర్టులోనే కాల్చి చంపేశాడు.
వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసు ఏడీజీ అఖిల్ కుమార్ తెలిపారు. ఆ సమయంలో కోర్టు ప్రాంగణాల్లో ఉన్న పోలీసులపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.
#Soldier #court #Accused #RapeCase #UttarPradesh