

INDvsSA | టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ వేసే యార్కర్లు పనిచేయడం లేదని, అతడితో ప్రస్తుతం ఉపయోగం లేదని టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ అన్నాడు. భువనేశ్వర్‌ను తొలగించి అతడి స్థానంలో దీపక్ చాహర్‌ను తీసుకోవాలని సూచించాడు.
సౌత్‌ఆఫ్రికాతో జరిగిన మొదటి రెండు వన్డేల్లో టీమిండియా ఓడిపోవడంతో సిరీస్ చేజారింది. ముందుగా టెస్ట్ సిరీస్ పోవడంతో పాటు, ఇప్పుడు వన్డే సిరీస్ కూడా పోగొట్టుకోవడంతో ఎలాంటి ట్రోఫీ లేకుండానే టీమిండియా ఇంటి బాట పట్టాల్సి వస్తోంది. అంతేకాకుండా రెండో వన్డేలో టీమిండియా ఓడిన తీరు మాజీలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ః
ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. పేసర్ భువనేశ్వర్ కుమార్‌పై విమర్శలు గుప్పించాడు. భువీ బౌలింగ్‌లో పదును తగ్గిపోయిందని, అతడి యార్కర్లు ఏ మాత్రం పనిచేయడం లేదని అన్నాడు.

భువీతో పోల్చితే చాహర్ బ్యాట్‌తో కూడా ఉపయోగపడతాడని, అతడు యువకుడు కాబట్టి తగినన్ని అవకాశాలు ఇవ్వాలని సూచించాడు. అంతేకాకుండా భువీ బౌలింగ్‌ని ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ ముందుగానే పసిగట్టేస్తున్నారని, దానివల్ల సులువగా ఆడగలుగుతున్నారని పేర్కొన్నాడు
‘భువీ అద్భుతమైన యార్కర్లు, స్లో డెలివరీలు విసురుతాడు. అందులో అనుమానం లేదు. కానీ అవేవీ ఇప్పుడు పనిచేయడం లేదు. అతడు విసిరే ప్రతి బంతినీ బ్యాట్స్‌మన్ ముందుగానే అర్థం చేసుకుంటున్నారు. సులభంగా ఎదుర్కోగలుగుతున్నారు.
అందువల్ల అతడి స్థానంలో యువకుడైన దీపక్ చాహర్‌ను తీసుకోవాలి. అతడు బ్యాటింగ్‌లో కూడా జట్టుకు లోయర్ ఆర్డర్‌లో ఉపయోగపడతాడు’ అని గవాస్కర్ పేర్కొన్నాడు.
#BhuvaneswarKumar #INDvsSA #DeepakChahar #SunilGavaskar