Blood water falls | రక్తపు జలపాతం గురించి తెలుసా..?

Blood water falls | అంటార్క్‌టికాలో ఉండే రక్తంలా పారే జలపాతాన్ని చూశారా..? తెల్లటి మంచు కొండల మధ్య నుంచి ఎర్రటి జలపాతం..

Spread the love
blood water falls

The Blood Falls seeps from the end of the Taylor Glacier into Lake Bonney. The tent at left provides a sense of scale for just how big the phenomenon is. Scientists believe a buried saltwater reservoir is partly responsible for the discoloration, which is a form of reduced iron.

Blood water Falls in Antarctica

Blood water falls | ఎప్పుడైనా రక్తంలా పారే జలపాతాన్ని చూశారా..? అంటార్క్‌టికా(Antarctica)లో అలాంటి ఓ జలపాతమే ఉంది. తెల్లటి మంచు కొండల మధ్య నుంచి ఎర్రటి జలపాతం కిందకు పడుతూ ఉంటుంది. ఇది చూడ్డానికి అచ్చం రక్తం లానే ఉంటుంది. ఒక్కసారిగా చూస్తే ఇది కచ్చితంగా రక్తమే అనుకుంటారు. కానీ దీనిపై పరిశోధనలను చేసిన శాస్త్రవేత్తలు దీని వెనకున్న మిస్టరీని 6 ఏళ్ల క్రితం దాదాపు ఛేదించారు. అసలేంటీ రక్తపు జలపాతం..? దీనివెనకున్న రహస్యమేంటి..? అంటార్క్‌టికాలోని మెక్ ముర్డో డ్రే వ్యాలీలో ఉన్న టేలర్ గ్లేసియర్‌ నుంచి ఈ ఎర్రటి నీటి ధార కిందికి పడుతూ.. కింద ఉన్న బోనీ సరస్సులో కలుస్తుంది.

1911లో కనిపెట్టారు:

ఈ సరస్సును 1911లో శాస్త్రవేత్తలు తొలిసారి కనిపెట్టారు. ఆ సమయంలో ఈ జలపాతం గడ్డకట్టి ఉంది. దీంతో ఈ ఎరుపు రంగుకు కారణం ఆల్గే.. అంటే నాచు కారణం అయి ఉండొచ్చనుకున్నారు శాస్త్రవేత్తలు. కానీ ఆ తర్వాత అసలు విషయం తెలిసింది. ఈ సరస్సులో నీటిలో ఉప్పు శాతం ఎక్కువ. అలాగే ఐరన్ ఖనిజం ఎక్కువగా ఉండడంతో ఈ నీరు ఇలా ఎర్రగా మారి బయటకు వస్తోందని శాస్త్రవేత్తలు తేల్చారు. అంతేకాదు.. ఈ సరస్సులో జీవం పుట్టుకనాటి మైక్రోబ్స్.. అంటే సూక్ష్మ జీవులను కూడా కనిపెట్టారు శాస్త్రవేత్తలు. వాళ్లు చెబుతున్న వివరాల ప్రకారం.. ఈ టేలర్ గ్లేసియర్ మధ్యలో దాదాపు 20 లక్షల సంవత్సరాల క్రితం ఓ చిన్న నీటి కొలను ఉండేది.

Mystery of Antarctica's Blood water Falls finally solved HD - YouTube

కోట్ల ఏళ్లనాటి మైక్రోబ్స్:

ఆ సరస్సులో అందులో కోట్ల సంవత్సరాలనాటి మైక్రోబ్స్ ఉండేవి. మైక్రోబ్స్ అంటే బాక్టీరియా లాంటి సూక్ష్మ జీవులన్నమాట. ఆ మైక్రోబ్స్‌కి శాస్త్రవేత్తలు ప్రీమోర్డియల్ ఊజ్ అని పేరు పెట్టారు. ఇవి అతి పురాతనమైనవని తేల్చారు. అయితే 20 లక్షల సంవత్సరాల క్రితం టేలర్ గ్లేసియర్ ఆ నీటి సరస్సును మూసేసింది. దీంతో ఆ గ్లేసియర్ మధ్యలో నుంచి సన్నటి పాయగా నీరు బయటకు వస్తూ ఓ చిన్న సైజు జలపాతంలా మారింది. ఇక సరస్సు మూసుకుపోవడంతో అందులోని ఉండే మైక్రోబ్స్‌కు కావలసిన ఆక్సిజన్, కాంతి లభించకుండా పోయాయి. కొద్ది పాటి వేడిలో బతకాల్సి వచ్చింది. దీనిని బట్టి చూస్తే.. భూమిపై ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా జీవం బతకగలదని నిర్ధారణ అయిందని తేల్చారు. ఈ అధ్యయనం.. వాళ్లకి వేరే గ్రహాలపై అధ్యయనం చేయడానికి కూడా ఉపయోగపడుతోంది.

విశ్వం గుట్టు విప్పుతుందా..?:

బూమిపై ఎలా అయితే.. ఇంతటి తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా జీవం ఉందో.. ఇతర గ్రహాలపై కూడా జీవం ఉండొచ్చని వారు అంచనా వేస్తున్నారు. అంగారక గ్రహం, బృహస్పతి ఉపగ్రహం యూరోపాలపై ఇలాంటి వాతావరణమే ఉండడంతో అక్కడ కూడా జీవం ఉండే చాన్స్ ఉండొచ్చని పరిశోధనల్లో వేగం పెంచారు. అంటే మన భూమ్మీద ఉన్న ఓ చిన్న నీటి కొలను అంతరిక్షం రహస్యాలను సైతం అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతోందన్నమాట. గ్రేట్ కదా. ఇదే కాదు.. అంటార్క్‌టికాలో ఇలాంటి ఎన్నో మిస్టరీలున్నాయి.

#BloodWaterfalls #Antarctica #Mistery

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *