

Sachin | సచిన్ టెండూల్కర్.. ఈ పేరు తెలియని క్రికెట్ అభిమానులెవరూ ఉండరు. అలాగే అమితాబ్ బచ్చన్ తెలియని సినీ ప్రేమికులూ ఉండరు. ఎందుకంటే వీళ్లిద్దరూ వారి వారి రంగాల్లో దిగ్గజాలు.
అలాంటి దిగ్గజాలు ఎప్పుడైనా సరే చాలా మర్యాద పూర్వకంగా ప్రవర్తిస్తుంటారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. యాక్టింగ్ లెజెండ్ బిగ్ బీ.. తన సోషల్ మీడియా టీం చేసిన చిన్న పొరపాటు వల్ల సచిన్ టెండూల్కర్‌కు క్షమాపణలు చెప్పారు.
దీనికి కారణం మరికొన్నిరోజుల్లో జరగబోయే లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్‌సీ). ఈ లీగ్‌లో చాలా మంది మాజీ దిగ్గజ ఆటగాళ్లు ఆడతారని తెలుసు కదా. అందుకే దీనికి ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు.

వీటిలో భాగంగానే అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. దీనిలో అమితాబ్.. చాలా మంది క్రికెట్ లెజెండ్స్‌లా యాక్ట్ చేస్తూ ఈ లీగ్‌లో ఆడే లెజెండ్స్ పేర్లు చెప్తూ కనిపించారు.
సెహ్వాగ్, గేల్, యువరాజ్, భజ్జీ (హర్భజన్ సింగ్), వసీం అక్రమ్ వంటి దిగ్గజాల పేర్లు చెప్పిన బిగ్ బీ.. సచిన్ పేరు కూడా చెప్పారు. గతంలో ఈ టోర్నీలో ఆడిన సచిన్ ఈసారి లీగ్‌కు దూరంగా ఉంటున్నాడు.
ఇదే విషయాన్ని సచిన్ టీం ఎత్తిచూపింది. బిగ్ బీకి విషయం చెప్పింది. దీంతో తన పొరపాటును గుర్తించిన బిగ్ బీ.. వెంటనే ఆ ట్వీట్ డిలీట్ చేసేశారు. సచిన్ పార్ట్ లేకుండా మరో వీడియో షేర్ చేశారు.
దాంతోపాటు ‘‘ఈ పొరపాటు వల్ల మీకు ఇబ్బంది కలిగించినందుకు చింతిస్తున్నాము. ఇది కావాలని చేసింది కాదు’’ అంటూ ట్వీట్ చేశారు.
https://twitter.com/SrBachchan/status/1479758647127265281?t=WJoG-2QSBW-SDoF-thlcQw&s=19
#Sachin Tendulkar# Amitabh Bachchan# Cricket