
Ind vs NZ

Ind vs NZ | టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ని యువ స్పిన్నర్ అక్షర్ పటేల్ ట్రోల్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. న్యూజిల్యాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మూడో రోజు ఆట తర్వాత రవిచంద్రన్ అశ్విన్, కేఎస్ భరత్, అక్షర్ పటేల్‌లు ఒకరినొకరు ఇంటర్వ్యూ చేసుకున్నారు.
ఈ వీడియోలో మొదట కేఎస్ భరత్‌ను అశ్విన్ ఇంటర్వ్యూ చేశాడు. ఫస్ట్ టైం టీమిండియా తరపున ఆడడం ఎలా ఉందని అడిగాడు. దానికి భరత్ గ్రౌండ్‌లోకి వచ్చిన మొదటి పావుగంట చేతులు వణికాయని, ఆ తర్వాత అంతా సెట్ అయిందని చెప్పాడు. ఆ తర్వాత అక్షర్‌ని ‘రాస్ టేలర్ వికెట్ తీశావ్ కదా.. అలా బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ చేతుల్లో పడాలంటే ఏం చేయాలి..?’ అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు సమాధానంగానే ‘అంతా బంతి తిరగడంలోనే ఉంది’ అంటూ అశ్విన్‌ను అక్షర్ ట్రోల్ చేశాడు.

‘బంతిని తిరగడంలో సీక్రెట్ అంతా ఉంది. నువ్వు వేసే బంతి ఎక్కువగా తిరుగుతుంది. అందుకే అది బ్యాట్స్‌మన్ బ్యాట్‌ను దాటి వెళ్లిపోతుంది. కానీ నేను విసిరే బంతి అంతగా తిరగదు. అందుకే అది బ్యాట్స్‌మన్ బ్యాట్ ఎడ్జ్‌కు ఎక్కువగా తగుతులుతుంది. అలా వికెట్ దక్కుతుంది.’ అని చెప్పుకొచ్చాడు.
దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోను నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు.