Virat Kohli | కోహ్లీ రిటైర్మెంట్ పై అనుష్క శర్మ రియాక్షన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సుదీర్ఘ పోస్ట్

Virat Kohli | టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ ఈ మధ్యనే రిటైర్మెంట్ ప్రకటించడంపై అనుష్క శర్మ..

Spread the love

Virat Kohli | టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ ఈ మధ్యనే ప్రకటించిన విషయం తెలిసిందే. విరాట్ రిటైర్మెంట్ పై అనుష్క శర్మ అత్యంత సుదీర్ఘ పోస్ట్ చేసింది.

‘‘2014లో నాకు ఆ రోజు ఇంకా గుర్తే. ధోనీ టెస్టుల నుంచి రిటైరవుతూ నిన్ను కెప్టెన్ చేశాడని నాకు చెప్పావు. నువ్వు, ధోనీ, నేను కాసేపు ఇదే విషయంపై మాట్లాడుకున్నాం. అప్పుడు ధోనీ జోక్ చేస్తూ కెప్టెన్ అయితే జుట్టు త్వరగా తెల్లబడుతుందని సరదాగా అన్నాడు. అందరం నవ్వుకున్నాం.

కానీ ఈ 7 ఏళ్లలో నీ గడ్డం తెల్లబడటమే కాదు.. నీలో గొప్ప ఎదుగుదలను చూశా. భారత టెస్టు జట్టు సారధిగా నీ చుట్టూ, నీలో కనిపించిన ఆ ఎదుగుదలను, నీ కెప్టెన్సీలో జట్టు సాధించిన విజయాలను చూసి గర్వపడుతున్నా. ఈ విజయాలకంటే నీలో నువ్వు సాధించిన ఎదుగుదలే నాకు ఎక్కువ గర్వకారణం.

2014లో మనం చిన్నవాళ్లం, అమాయకులం. మంచి ఆలోచనలు, పాజిటివ్‌గా ఉండటం, లక్ష్యాలు మనల్ని ముందుకు తీసుకెళ్తాయని అనుకున్నాం. కానీ సవాళ్లు తప్పవు కదా. అలాగే వీటిలో చాలా సవాళ్లు మైదానంలోనే ఎదురుకావు. ఎంతైనా ఇది జీవితం కదా! అసలు ఊహించని విషయాల్లోనే మనల్ని పరీక్షిస్తుంది.

Virat Kohli

ఆ విషయంలో ఎన్ని సమస్యలు వచ్చినా గొప్ప నిర్ణయాలకు అడ్డుపడకుండా చూసుకున్నందుకు నిన్ను చూసి చాలా గర్విస్తున్నా ప్రియా. నువ్వు మైదానంలో గెలిచేందుకు నీ శరీరంలోని శక్తినంతా ధారపోశావు. కొన్ని ఓటముల తర్వాత కళ్లనిండా నీళ్లతో గెలవడానికి నేనింకా ఏమైనా చేసుండాల్సింది అంటున్నప్పుడు నేను నీ పక్కనే కూర్చున్న రోజులున్నాయి. అదే నువ్వు, అందరూ అలాగే ఉండాలని అనుకుంటావు.

నువ్వు మడి కట్టుకు కూర్చోవు, ముక్కుసూటిగా ప్రవర్తిస్తావు. సహనం నీకు శత్రువు. ఈ లక్షణాలే నిన్ను నాతోపాటు నీ అభిమానుల దృష్టిలో గొప్పవాణ్ణి చేశాయి. ఎందుకంటే వీటన్నింటి కింద నీ స్వచ్ఛమైన, కలుషితం కాని భావాలు ఎప్పుడూ ఉంటాయి. ఈ విషయం అందరూ అర్థం చేసుకోలేకపోవచ్చు.

నేను చెప్పాను కదా.. కంటికి కనిపించే దాని వెనుక నువ్వేంటో అర్థం చేసుకున్న వాళ్లు నిజంగా గొప్పవాళ్లు. నువ్వు పర్‌ఫెక్ట్ కాదు. కొన్ని లోపాలున్నాయి. కానీ వాటిని నువ్వెప్పుడు దాచే ప్రయత్నం చేశావు? ఎప్పుడూ మంచి చేయడం కోసమే ముందుకొస్తావు. అది ఎంత కష్టమైనా! ఎప్పుడూ నువ్వే ముందుంటావు.

నువ్వు దేన్నీ స్వార్ధంతో పట్టుకొని ఉంచుకోలేదు. చివరకు ఈ స్థానాన్ని కూడా అది నాకు తెలుసు. ఎందుకంటే ఎవరైనా దేన్నయినా చాలా గట్టిగా పట్టుకుంటే తమకు తాము సరిహద్దులు విధించేసుకుంటారు. కానీ నీకు హద్దులు లేవు.

ఈ ఏడేళ్ల కాలంలో తన తండ్రి నేర్చుకున్న పాఠాలను మన కూతురు కూడా భవిష్యత్తులో చూస్తుంది’’ అంటూ తన ఇన్స్టాగ్రామ్ లో సుదీర్ఘ పోస్టు చేసింది అనుష్క శర్మ.

#ViratKohli #AnushkaSharma #KohliRetirement #BCCI
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *