Omicron | కొత్తగా 6 ‘ఒమిక్రాన్‌’ కేసులు.. ఎక్కడెక్కడంటే..!

Omicron

Omicron

Omicron

Omicron | అమెరికాలో మరో ఆరు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ఇప్పటికే ఈ వేరియంట్ పేరు చెబితే ప్రపంచ దేశాలు వణికిపోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా డెల్టా వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా సృష్టించిన ప్రళయాన్ని చూసిన తర్వాత.. ‘ఒమిక్రాన్‌’ భయం మరింత కలవరపెడుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో ఈ వేరియంట్ వ్యాపించిన దేశాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉండటం ఆందోళన పెంచుతోంది. దీనికితోడు ఇప్పటికే ఈ వేరియంట్ పాకిన దేశాల్లో ‘ఒమిక్రాన్‌’ కేసులు కూడా పెరుగుతున్నాయి.

Omicron

తాజాగా భారత్‌లో మూడో ఒమిక్రాన్ కేసు నమోదైంది. అలాగే అగ్రరాజ్యం అమెరికాలో కొత్తగా ఆరు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ఈ విషయాన్ని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వెల్లడించింది.

కొత్తకేసులు న్యూజెర్సీ, మేరీల్యాండ్, మిస్సోరీ, నెబ్రాస్కా, పెన్సిల్వేనియా, ఉటాలో నమోదైనట్లు సీడీసీ చీఫ్ తెలియజేశారు. ఇంతకుముందే హవాయి, న్యూయార్క్, కొలరాడో, మిన్నెసోటా, కాలిఫోర్నియాలో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతానికి అమెరికాలో ఎక్కువగా ‘డెల్టా’ వేరియంట్ కేసులే ఉన్నాయని సీడీసీ అధికారులు పేర్కొన్నారు.

#Omicron #America #NewCases

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *