

Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తెలియని వారుండరు. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హోదా అందుకున్న బన్నీ తాజాగా మరో పాన్ ఇండియా సినిమాకు పచ్చజెండా ఊపాడట. ఈమేరకు వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్నాయి. ‘పుష్ప’ సినిమాను తమిళంలో డిస్ట్రిబ్యూట్ చేసిన లైకా ప్రొడక్షన్స్ వారు బన్నీకి ఈ ఆఫర్ ఇచ్చారట.

తమ బ్యానర్‌లో చేయనున్న అప్‌కమింగ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో బన్నీని హీరో ఓకే చేశారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఈ సినిమాను తమిళ స్టార్ డైరెక్టర్ తెరకెక్కించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమా కోసం బన్నీ భారీ మొత్తంలో పారితోషికం డిమాండ్ చేశాడని, అందుకు కూడా లైకా ప్రొడక్షన్స్ ఓకే చేసిందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను ‘పుష్ప2’ పూర్తయిన వెంటనే స్టార్ట్ చేస్తారట.

ఈ చిత్రాన్ని ఏఆర్ మురుగదాస్, అట్లీ వీరిలో ఒకరు డైరెక్ట్ చేయనున్నారని టాక్ వస్తోంది. మరి ఇందులో నిజమెంతనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
#Bunny #Pushpa #LycaProductions PanIndia