Radhesyam | రాధేశ్యామ్‌తో ఢీ అంటే ఢీ.. బాలీవుడ్ స్టార్ రెడీ?

Radhesyam | మోస్ట్ ఎవెయిటెడ్ సినిమాల్లో ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ఒకటి. ఇదే సమయంలో ఈ సినిమాకు పోటీ ఇచ్చేందుకు ఓ బాలీవుడ్ స్టార్ హీరో..

Spread the love
Radhesyam
Radhe Shyam

Radhesyam | మోస్ట్ ఎవెయిటెడ్ సినిమాల్లో ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ఖచ్చితంగా ఉంటుంది. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆత్రుతగా చూస్తున్నారు.

కానీ కరోనా కారణంగా ఈ సినిమా పలుసార్లు వాయిదా పడింది. ఇటీవల సంక్రాంతి బరి నుంచి కూడా ఈ సినిమా తప్పుకుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమాను మార్చి 18న విడుదల చేయాలని ‘రాధేశ్యామ్’ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

Radhesyam

ఇదే సమయంలో బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ఈ సినిమాకు పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తన అప్‌కమింగ్ మూవీ ‘బచ్చన్ పాండే’ సినిమాను కూడా మార్చి 18కి విడుదల చేయనున్నట్లు అక్షయ్ ప్రకటించాడు.

దీంతో ఈ రెండు సినిమాల మధ్య క్లాషెస్ వచ్చేలా ఉన్నాయి. కానీ ‘రాధేశ్యామ్’ మేకర్స్ ఇంకా తమ ప్రకటన చేయలేదు కాబట్టి వారే వెనక్కి తగ్గే అవకాశాలు ఉన్నాయని నెట్టింట వార్తలు తెగ వినిపిస్తున్నాయి.

మరి ఈ రెండు సినిమాలో బాక్సాఫీస్ దగ్గర తలపడతాయా, లేకుంటే ఎవరైనా వెనకడుగు వేస్తారా అన్నది వేచి చూడాలి.

#Akshay kumar Radheshyam #Prabhas #Bachchanpandey

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *