Akhanda | అఖండ అదుర్స్.. దిమ్మ తిరిగే ఫస్ట్ డే కలెక్షన్స్

Akhanda

Akhanda | బాలయ్య-బోయపాటి కలిసి సినిమా తీశారంటేనే ఆ సినిమాలో ఓ వైబ్రేషన్ ఉంటుంది. ఆ సినిమా రేంజే వేరుగా ఉంటుంది. పవర్‌ఫుల్ పంచ్ డైలాగ్‌లు, పవర్‌పాక్ట్ ఫైట్స్‌తో అదిరిపోతుంది సినిమా. వీరిద్దరి కాంబోలో తాజాగా వచ్చిన అఖండ సినిమా కూడా సరిగ్గా అలాగే ఉంది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే బంపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. తొలిరేజే భారీ కలెక్షన్స్ కలెక్ట్ చేస్తూ రికార్డులు బద్దలు కొడుతోంది.
అఖండ ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికి వస్తే.. ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు అఖండ మూవీ దాదాపు రూ.18 కోట్లకు పైగా రాబట్టింది. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. నైజాం – రూ.4.39 కోట్లు, సీడెడ్ – రూ.4.02 కోట్లు, యూఏ – రూ.1.36 కోట్లు, గుంటూరు – రూ.1.87 కోట్లు, తూర్పు గోదావరి జిల్లా – రూ.1.05 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లా – రూ.0.9 కోట్లు, కృష్ణా జిల్లా – రూ.0.81 కోట్లు, నెల్లూరు – రూ.0.93 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో కెవిన్ కుమార్ కొరియగ్రఫీలో తెరకెక్కిన క్లైమాక్స్ ఫైట్ సీన్స్, ఆ సీన్స్‌లో తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాను ఓ రేంజ్‌కి తీసుకెళ్లాయి. ఫ్యాన్స్‌కు ఓ ట్రాన్స్‌లోకి తీసుకెళతాయనడంలో సందేహం లేదు.
#Akhanda #1stDayCollections #NBK #Balakrishna #BoyapatiSreenu