Ajaz patel | కుంబ్లే రికార్డ్ కొట్టేశాడు.. ప్రపంచ క్రికెట్లో..

Ajaz patel

Ajaz Patel | క్రికెట్ అంటే సిక్స్‌లూ, ఫోర్లే కాదు.. వికెట్లు కూడా. ఈ విషయాన్ని ఫ్యాన్స్ మర్చిపోయినప్పుడల్లా.. బౌలర్లు గుర్తు చేస్తూనే ఉంటారు. మేం కూడా ఉంటేనే క్రికెట్ మజా అని రుజువు చేస్తుంటారు.
ఇప్పుడు కూడా ఓ బౌలర్ అలాంటి ఓ అరుదైన ఫీట్ సాధించి రికార్డులకెక్కాడు. ఇంతకీ ఆ బౌలర్ ఎవరు..?
క్రికెట్ అంటే బ్యాట్స్‌మన్ గేమ్‌గా మారిపోయిన ఈ రోజుల్లో బౌలర్లు తమ అస్థిత్వం కోసం పోరాడుతున్నారనడంలో సందేహం లేదు.
కానీ కొంతమంది మాత్రం తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పడమే కాదు.. క్రికెట్‌ని శాసించే సత్తా బౌలర్ల కూడా ఉంది అని నిరూపిస్తున్నారు. అలాంటి మరో క్రికెటరే అజాజ్ పటేల్.
ప్రపంచ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన బౌలర్ ఎవరంటే.. మనకు వెంటనే అనిల్ కుంబ్లే గుర్తొస్తాడు. కుంబ్లే కంటే ముందు ఇంగ్లీష్ స్పిన్నర్ జిమ్ లేకర్ ఈ ఫీట్ సాధించాడు. తాజాగా ఆ లిస్ట్‌లో అజాజ్ కూడా చేరాడు.

టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో కివీస్ బౌలర్ అజాస్.. భారత బ్యాట్స్‌మన్ అందరినీ పెవిలియన్ చేర్చి అత్యంత అరుదైన రికార్డు సృష్టించాడు.
పేసర్లు, మిగిలిన స్పిన్నర్లు కూడా బౌలింగ్ వేసినా.. భారత బ్యాట్స్‌మెన్ అంతా ఏదో అగ్రిమెంట్ చేసుకున్నట్లు అజాజ్ బౌలింగ్‌లోనే అవుటయ్యారు.
దీంతో జిమ్, కుంబ్లేల తర్వాత ఈ రికార్డు సాధించిన మూడో బౌలర్‌గా అజాజ్ రికార్డు సృష్టించాడు.
ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తో మొదలైన అతడి వికెట్ల వేట.. చివర్లో మహ్మద్ సిరాజ్‌ను అవుట్ చేసే వరకు నిర్విరామంగా కొనసాగింది.

ఇక తొలి ఇన్నింగ్స్‌లో అజాజ్ మాయతో టీమిండియా 325 పరుగులకు ఆలౌట్ అయింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్ దారుణ ప్రదర్శన చేస్తోంది. ఒక్క బ్యాట్స్‌మన్ కూడా కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోతున్నారు.
దీంతో ఇప్పటి సమాచారం మేరకు 34 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉంది.
#AjajPatel #TeamIndia #NewZealand #INDvsNZ #2ndTest #Mumbai #WankhadePitch #Wankhade stadium