Hyderabad Zoo | సింహం బోనులో దూకబోయాడు.. వైరల్ వీడియో

Hyderabad Zoo

Hyderabad Zoo: హైదరాబాద్ జూలో మంగళవారం ఓ షాకింగ్ ఘటన జరిగింది. జూలోని లయన్ ఎన్‌క్లోజర్లోకి ఓ యువకుడు దూకబోయాడు. చూస్తున్న జనాలంతా హాహాకారాలు చేయడంతో జూ సిబ్బంది అప్రమత్తమై.. యుకవుడిని కాపాడారు. యువకుడిని కీసరకు చెందిన సాయి కుమార్‌గా గుర్తించారు. సరిగ్గా 5 మీటర్ల దూరంలో వాలుగా ఉన్న రాయిపై సాయి కూర్చున్నాడు.
కింద సింహం నిలబడి ఉంది. ఏ మాత్రం చిన్న పొరపాటు జరిగినా.. ఆ యువకుడు సింహం దగ్గర పడడం.. ఆ సింహం చీల్చి చంపేయడం జరిగిపోయేవి. ఇంతలో జనాలు అరవడంతో జూ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వారిని చూసి సింహం వెనక్కి వెళ్లింది. సాయిని పట్టుకున్న జూ సిబ్బంది రెండు తగిలించి తీసుకెళ్లడం వీడియోలో కనిపిస్తుంది.
జూ సిబ్బంది చెబుతున్న వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 3.30గంటల సమయంలో జూ పార్క్‌లోని నిషేధిత ప్రాంతంలోకి వెళ్లిన సాయికుమార్ ఉన్నట్లుండి ఆఫ్రికన్ సింహం ఉన్న ఎన్‌క్లోజర్‌లోకి దూకడానికి ప్రయత్నించాడు. దూకడానికి సిద్ధంగా వాలుగా ఉన్న బండరాయిపై కూర్చొన్నాడు. అతడిని గమనించిన సింహం కూడా సమీపంలోకి వచ్చింది. జారిపడి ఉంటే సింహం దాడి చేసేది.
చూస్తున్న వారంతా వారిస్తున్నా సాయి కుమార్ పట్టించుకోలేదు. విషయం తెలిసిన వెంటనే తాము వెళ్లి యువకుడిని కాపాడడం జరిగింది. బహదూర్‌పురా పోలీస్ స్టేషన్‌లో అప్పగించడం జరిగింది.
కాగా.. దర్యాప్తు చేసిన పోలీసులు సాయికుమార్‌కు మతి స్థిమితం లేదని గుర్తించారు. అయితే సింహాలు తిరిగే ప్రాంతంలో బంగారం, రత్నాలు ఉంటాయని ఎవరో చెప్పడంతోనే లోపలికి దిగాలనుకున్నాని సాయి చెప్పాడం ఇక్కడ అసలు ట్విస్ట్.