Gunguly | గంగూలీ కుటుంబంలో కరోనా కలకలం.. నలుగురికి పాజిటివ్


Gunguly | ఇటీవల కరోనా బారిన పడిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కుటుంబంలో మళ్లీ కరోనా కలకలం రేగింది.
గంగూలీ కుమార్తె సనాతోపాటు మరో ముగ్గురు కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. కరోనా పరీక్షల్లో వారందరికీ పాజిటివ్ ఫలితం వచ్చింది.
డిసెంబరు 28న గంగూలీకి కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఆయనకు డెల్టా ప్లస్ వేరియంట్ సోకినట్లు వార్తలు వచ్చాయి.
దీంతో కోల్‌కతాలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో గంగూలీకి చికిత్స అందిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గంగూలీ కుటుంబంలో మరో నాలుగు కరోనా కేసులు వెలుగు చూడటం గమనార్హం.
అయితే వీరెవరిలోనూ కరోనా లక్షణాలు కనిపించలేదని సమాచారం. దీంతో సనాతో పాటు కుటుంబ సభ్యులందరూ ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
#SouravGunguly #Covid #Kolkata #BCCI