

Vaccine | పిల్లలకు బూస్టర్ డోస్ వేసేందుకు యూఎస్ ఫుడ్ అండ్ హెల్త్ డిపార్టిమెంట్ (ఎఫ్‌డీఏ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ మేరకు సోమవారం ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం కరోనా విజృంభణను దృష్టిలో పెట్టుకొని థర్డ్ వేవ్‌ను అడ్డుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఇందులో భాగంగానే ఇప్పటి వరకు పెద్దవారికే పరిమితమైన బూస్టర్ డొస్‌ను ఇకపై 12-15 వయసు వారికి వేయోచ్చని తెలిపింది. ఫైజర్ కంపెనీ బూస్టర్ డోస్‌కు మాత్రమే యూఎస్ ఓకే చెప్పింది.
అంతేకాకుండా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న 5-11 సంవత్సరాల పిల్లలకు మూడో డోస్ టీకాకు ఆమోదం తెలిపింది. వాటితో పాటుగా బూస్టర్ డోస్ విరామ సమయాన్ని 6 నుంచి 5 నెలలకు తగ్గించింది.
అంతేకాకుండా బూస్టర్ డోస్ పిల్లలకు వేయడం ద్వారా ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టవచ్చని యూఎస్ ప్రభుత్వం తెలిపింది.
# US$# Covid-19# vaccination# Booster Dose# Pfizer