

గడిచిన రెండేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా. దీన్నుంచి ఎవరూ తప్పించుకోలేకపోతున్నారు. చిన్నాపెద్దా తేడాలేకుండా అందరిపై పగబట్టిన పాములా దాడి చేస్తున్న ఈ వైరస్.. కొంతమందికి సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని సర్ గంగారాం హాస్పటల్‌లో చేసిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వారికి కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది? అనే అంశంపై పరిశోధకులు అధ్యయనం చేశారు.
మొత్తం 2,586 మంది కరోనా పేషెంట్లపై ఈ పరిశోధన జరిగింది. దీనిలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఏ, బీ, ఆర్‌హెచ్ పాజిటివ్ బ్లడ్ గ్రూపులు ఉన్న వాళ్లకు కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తేలింది. అదే సమయంలో ఏబీ, ఓ, ఆర్‌హెచ్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులకు కరోనా సోకే అవకాశం తక్కువగా ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. ఈ అధ్యయనంలో తేలిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. అదే బ్లడ్ గ్రూప్ ఉన్న ఆడాళ్ల కంటే మగాళ్లకే కరోనా సోకే ప్రమాదం ఎక్కువ.