

Machana | సమాజ హితం కోసం పాటు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి కి జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ప్రోత్సాహకం అందింది. యువతను విద్యా, ఉద్యోగ అవకాశాల సాధన కోసం చైతన్య పరచడం, పొగాకు నియంత్రణకు విశేషంగా కృషి చేస్తున్న మాచన రఘునందన్ సేవలకు మరోసారి జాతీయ స్థాయిలో ప్రోత్సాహం లభించింది.
జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా, పంజాబ్ చండీగఢ్ కు చెందిన రిసోర్స్ సెంటర్ ఫర్ టుబాకొ కంట్రొల్ (ఆర్ సీ టీ సీ) రఘునందన్ ను ఆర్నెల్ల శీక్షణ కు ఎంపిక చేసింది.ఈ మేరకు బుధవారం నాడు సమాచారాన్ని ట్విట్టర్ ద్వారా తెలియ జేసింది.
ఇది వరకే గత ఏడాది ఆర్ సీ టీ సీ రఘునందన్ కు పూర్తి స్థాయి ఉపకార వేతనం తో కూడిన పొగాకు నియంత్రణ శిక్షణ ను అందజేసింది.

అది విజయ వంతంగా పూర్తి చేసుకున్నoదుకు .ఇటీవల హైదరాబాదులో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి పొగాకు నియంత్రణ అవగాహన సదస్సుకు కు గౌరవ అతిధి గా ఎంపిక చేసింది.
మున్ముందు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే పలు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు హెచ్ ఓ) సదస్సుల కు రఘునందన్ హాజరవుతారు.
. #Machana #CivilSupplyOfficer #LearningForPublicHealth #RaghunandanMachana