

యూపీ మధురలో పోలీసులు కర్ఫ్యూ విధించారు. అంతేకాకుండా ఎక్కువ మంది ఒకే చోట గుమికూడితే ఊరుకునేది లేదంటూ పోలీసులు తెలిపారు. సీనియర్ సూపర్‌డెంట్ చెప్పిన వివరాల ప్రకారం.. బాబ్రీ మసీదు కూలగొట్టి ఏడాది కావస్తున్న సందర్భంగా ఎటువంటి అసంఘటిత చర్యలు జరగకుండా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అంతేకాకుండా శాంతి భద్రతలను కాపాడేందుకు మధురను వివిధ భాగాలుగా విభజించి రక్షణ దళాలను ఏర్పాటు చేశామని తెలిపారు. మధురను సూపర్ జోన్స్, జోన్స్, సెక్టార్లుగా విభజించామని, ప్రతి ప్రదేశంలో పోలీసు బలగాలతో పాటు డ్రోన్లతో కూడా నిఘా ఉంచామని, సోషల్ మీడియాపై సైతం ఓ కన్నేసి ఉంచామని చెప్పారు.
సోషల్ మీడియాలో ఏదైనా హింసాత్మక పోస్ట్ పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలో 145 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశామని, 4గురుకి మించి గుమిగూడకుండా చూసుకుంటున్నామని తెలిపారు. దాంతో పాటుగా సిటీలోకి ఎటువంటి హెవీ వెహికల్స్ రాకుండా అడ్డుకోవాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించామని చెప్పారు.