Bipin Rawat | ఛీ పాకిస్తాన్.. రావత్ మరణంపై ఈ ట్వీట్స్ చూస్తే..!

Bipin Rawat

Bipin Rawat | భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదం మరణించిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. సంతాపం ప్రకటిస్తోంది.
పాక్ సైనికాధికారి కూడా రావత్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అయితే ఒకపక్క సంతాపం వ్యక్తం చేస్తూనే మరో పక్క రావత్ మృతిపై పాక్‌లో పండుగ చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో కొంతమంది పాక్‌కు చెందిన అనేకమంది రావత్ మరణించడం పండగ చేసుకోవాల్సిన విషయమంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. భారత్‌పై వెక్కిరింపులకు తెగబడుతున్నారు.
‘బిపిన్ రావత్ మరణం పట్ల సంతోషించాల్సిన అవసరం లేదు. అతడి స్థానంలో మరొకరు వస్తారు. కానీ ఈ మరణం మనకి ఓ చిన్న వేడుకలా ఉండాలని, బిపిన్ రావత్‌ను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చంపించిందని కామెంట్లు చేస్తున్నారు.
అంతేకాకుండా త్వరలో రానున్న ఎలక్షన్లలో సింపతీ కోసం మోడీనే ఈ పని చేయించాడంటూ ట్వీట్‌లు చేస్తున్నారు. ప్రస్తుతం వీటిపై భారత్ ఎటువంటి స్పందన ఇవ్వలేదు. కానీ త్వరలోనే సరైన సమాధానం చెబుతుందని భారత ప్రజలు భావిస్తున్నారు.
పాక్ నుంచి ఇలాంటి అభ్యంతరకర పోస్టులు పోస్ట్ కావడంపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ తన వంకర బుధ్దిని మరోసారి బయటపెట్టిందని నిప్పులు చెరుగుతున్నారు. వెంటనే దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
#BipinRawat #IndianArmy #Pakistan