Sourya Chakra | అమరుడైన కొడుకు.. కన్నీటితో అవార్డు అందుకున్న తల్లి

Sourya Chakra

Sourya Chakra

Sourya Chakra

Sourya Chakra: అమ్మ ఎప్పుడూ బిడ్డలు బాగుండాలనే కోరుకుంటుంది. దానికోసం ఎంత కష్టాన్నైనా అనుభవిస్తుంది. కానీ ఆ బిడ్డే శాశ్వతంగా దూరమైతే. దేశ సేవ చేస్తూ ప్రాణాలు కోల్పోతే.. ఆ తల్లి ఆవేదనను వర్ణించడానికి మాటలు చాలవు.

అలాంటి ఆవేదనే మాతృమూర్తి సారా బేగంలో కనిపించింది. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన సారా బేగం కుమారుడు బిలాల్ అహ్మద్ మాగ్రే.

రాష్ట్ర స్పెషల్ పోలీస్ అధికారిగా పనిచేశారు. 2019లో ఉగ్రవాదుల నుంచి ఓ కుటుంబాన్ని కాపాడుతూ వీరోచితంగా పోరాడి ప్రాణాలొదిలారు. శరీరంలో బులెట్లు దిగుతున్నా.. బాధితులను కాపాడి చివరి శ్వాస విడిచారు.

అహ్మద్ త్యాగానికి గుర్తుగా కేంద్రం దేశ సైన్య అత్యున్నత పురస్కారమైన ‘శౌర్యచక్ర’తో గౌరవించింది.

ఈ అవార్డును మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో సారా బేగం‌కు అందించారు రాష్ట్రపతి కోవింద్. పళ్లబిగువును దుఃఖాన్ని అదుముకుంటూ వచ్చిన ఆమె.. అవార్డు అందుకున్నారు. ఆమెను చూసి అక్కడున్న వారందరి హృదయాలు బరువెక్కాయి.

Sourya Chakra

కాగా.. అహ్మద్ చేసిన సేవను, అతడి ధైర్య సాహసాలను అంతా ప్రశంసింస్తుంటే.. దేశం కోసం తన కుమారుడు చేసిన సేవల్ని తలుచుకుని ఆనందపడాలో, తన కొడుకు తనకు దూరమయ్యాడని బాధపడాలో తెలియని పరిస్థితి సారా బేగం అనుభవించారు.

పొంగుకు వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకూంటు తనను తాను ఓదార్చుకునే ప్రయత్నం చేశారు. తిరిగి వేళ్లే క్రమంలో అక్కడ కూర్చున్న వారందరికీ నమస్కారం చేసి నిష్క్రమించారు.

ఆ రోజు ఏం జరిగింది..?:
2019 ఆగస్టు 20న బారాముల్లాలోని ఓ ఇంట్లో మిలిటెంట్లు ఉన్నారనే సమాచారం రావడంతో ఓ సెర్చ్ ఆపరేషన్‌ నిర్వహించారు. ఇందులో అహ్మద్ కూడా ఉన్నారు.

ఇంట్లో ఉన్న సామాన్య కుటుంబీకులకు ఏమీ కాకుండా కాపాడడంతో పాటు మిలిటెంట్ల అంతం చేయడమే లక్ష్యంగా ఈ సెర్చ్ ఆపరేషన్ సాగింది.

అయితే ఈ ఆపరేషన్ సమయంలోనే మిలిటెంట్లు పోలీస్ అధికారులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

ఈ కాల్పుల్లో అహ్మద్ తీవ్రంగా గాయపడ్డారు. అయినా మిలిటెంట్లతో వీరోచిచంగా పోరాడి ఒకరిని మట్టు పెట్టారు. బిలాల్ కూడా అక్కడే చనిపోయారు.

ఈ ఘటనలో మాగ్రేతో పాటు మరో అధికారి, ఒక పౌరుడు తీవ్రంగా గాయపడ్డారు. కొద్ది సేపటికే మాగ్రే చివరి శ్వాస విడిచారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *