

Family Man | ప్రస్తుతం బిజీ లైఫ్ గడుపుతున్న వారిలో మనోజ్ బాజ్‌పెయి కూడా ఒకడు. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తర్వాత మనోజ్ భారీగా బిజీ అయిపోయాడు. ఎంతలా అంటే ఇటీవల తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌పై మనోజ్ స్పందిస్తూ.. తాను కొత్త స్క్రిప్ట్‌లు చదవడం మానేశానని, అందుకు తన బిజీ షెడ్యూలే కారణమని చెప్పాడు.
అంతేకాకుండా 2023 చివరి వరకు తాను వేరే సినిమాలను గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేనని, తాను ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసేందుకు 2023 చివరి వరకు టైం పడుతుందని చెప్పుకొచ్చాడు.
‘నటన అనేది దారుణమైన వృత్తి. చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఇక్కడ ఎవరూ నీకు రెండో ఛాన్స్ ఇవ్వడానికి ఇష్టపడరు’ అని మనోజ్ అన్నాడు. అంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలన్నది అతడి ఉద్దేశ్యం అని అభిమానులు అంటున్నారు.
ఏది ఏమైనా 2023 చివరి వరకు మాత్రం మనోజ్ క్షణం తీరిక లేకుండా నటించనున్నాడని అర్థం అవుతోంది.
#ManojBajpayee Schedule #Bollywood