

కరోనా మహమ్మారి ప్రపంచంపై దండయాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి లాక్‌డౌన్ (Lockdown) మన జీవితాల్లో భాగమైంది. ఈ మహమ్మారిని నిలువరించేందుకు లాక్‌డౌన్‌ను బ్రహ్మాస్త్రంలా ఉపయోగించాయి ప్రభుత్వాలు. అయితే ఇన్ని రోజులపాటు కరోనాతో సహజీవనం చేసిన తర్వాత ఇంకా లాక్‌డౌన్‌లు అవసరమా? అనే ప్రశ్న ప్రస్తుతం శాస్త్రవేత్తలను వేధిస్తోంది.
ఇది కూడా చదవండి: ప్రపంచంలో ఇలాంటి గ్రామాలు కూడా ఉంటాయా?
డెల్టా, ఒమిక్రాన్ వంటి వేరియంట్లు విజృంభించిన ప్రతిసారీ లాక్‌డౌన్ (Lockdown) పెట్టాల్సిందేనా? ఇదే ఇప్పుడు అందరి ముందు ఉన్న పెద్ద ప్రశ్న. దీనికి తాజాగా ఆఫ్రికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సమాధానం చెప్పింది. దీని డైరెక్టర్ జాన్ కెంగసాంగ్ మాట్లాడుతూ.. ఇకపై కరోనాను నియంత్రించేందుకు లాక్‌డౌన్‌లు పనికిరావని తేల్చిచెప్పారు.
Vaccine | పిల్లలకు బూస్టర్ డోస్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యూఎస్
కఠినమైన లాక్‌డౌన్‌లు (Lockdown) ఈ మహమ్మారిని నిలువరించలేవని ఆయన అన్నారు. ‘‘వ్యాక్సినేషన్ పెరుగుతున్న క్రమంలో పబ్లిక్ హెల్త్, సామాజిక చర్యలను సమర్థవంతంగా ఉపయోగించడం ఎలా అనే విషయంపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది’’ అని వివరించారు.