Taliban | తాలిబన్లకు భారత్ సాయం.. 2 టన్నుల మెడికల్ ఎయిడ్ అందజేత

Taliban | తాలిబన్ పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ కి భారత ప్రభుత్వం సాయం చేసింది. కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ విపరీతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో..

Spread the love
Taliban

Taliban | తాలిబన్ పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ కి భారత ప్రభుత్వం సాయం చేసింది. కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ విపరీతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆఫ్ఘన్ ప్రజల శ్రేయస్సు కోసం భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే దాదాపు 2 టన్నుల ఔషధాలను ఆఫ్ఘనిస్తాన్ కు భారత్ పంపించింది.

కోవిడ్ నివారణా ఔషధాలు, టెస్టింగ్ కిట్లు, వాక్సిన్లు ఇందులో ఉన్నట్లు సమాచారం.

ఆఫ్ఘనిస్తాన్ ని ఎవరు పరిపాలిస్తున్నా.. ఆ దేశ ప్రజల సంక్షేమమే భారత్ కోరుకుంటుందని, ప్రస్తుత కాస్త కాలంలో వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత భారత్ పై ఉందని భారత దేశ విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.

అలాగే ఆఫ్ఘనిస్తాన్ ప్రజలతో స్నేహ సంబంధాన్ని కొనసాగించాలని భారత్ కొలుకుంటోందని, అందులో భాగంగానే ఈ సాయం చేశామని పేర్కొంది. కాగా.. మరో వారంలో మరింత సాయం అందజేయనున్నట్లు తెలిపింది.

ఇక భారత్.. ఇప్పటికే రెండు సార్లు 2 దఫాలుగా వైద్య పరికరాలు, ఔషధాలు ఆఫ్ఘనిస్తాన్ కి పంపించింది. ఇది మూడో దఫా సాయం.

#Afghanisthan #India #HumanitarianAid #MEA Movie #Omicron

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *