26/11 | కసబ్‌ని గుర్తుపట్టిన పాప.. ఇప్పుడు ఎంత దుర్భరంగా బతుకుతోందో తెలుసా..?

26/11 | భారతదేశ చరిత్రలో ఎన్నో టెర్రరిస్ట్ దాడులు జరిగినా.. ఇప్పటికీ ఎప్పటికీ దేశం మర్చిపోలేని గాయం 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన దాడులు. ఆ దాడుల్లో ఎన్నో వందల ప్రాణాలు..

Spread the love
26/11

26/11 | భారతదేశ చరిత్రలో ఎన్నో టెర్రరిస్ట్ దాడులు జరిగినా.. ఇప్పటికీ ఎప్పటికీ దేశం మర్చిపోలేని గాయం 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన దాడులు. ఆ దాడుల్లో ఎన్నో వందల ప్రాణాలు పోయాయి. ఇంకా ఎంతోమంది వికాలంగులుగా మిగిలిపోయారు. అయితే అంతమంది ప్రాణాలు తీసుకున్న కసబ్‌ను పోలీసులకు పట్టించి ఎవరో తెలుసా..? ఓ 9ఏళ్ల పాప. ఆమె పేరు దేవికా రోతవాన్. 9 ఏళ్ల వయసులోనే కోర్టుకొచ్చి కసబ్‌ను గుర్తుపట్టిన సాహసి. వందల మంది ప్రాణాలు బలితీసుకున్న రాక్షసుడికి ఉరిశిక్ష పడేలా చేసిన ధీరురాలు. ఆమె ధైర్యానికి మెచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమెకు, ఆమె కుటుంబానికి ఎన్నో రకాలుగా సాయం చేస్తామని హామీలిచ్చాయి. కానీ ఇప్పటికీ తనకు ఎలాంటి సహకారం అందలేదని బాధపడుతోంది దేవిక. ఈ మధ్యనే తనకు రావలసిన సాయం కోసం కోర్టుకు కూడా ఎక్కిందామె.

దేవికా ఆవేదన ఆమె మాటల్లోనే.. `నా పేరు దేవికా రోతవాన్. ఇప్పుడు నా వయసు 22 సంవత్సరాలు. 13 ఏళ్ల క్రితం 9 ఏళ్ల వయసులో ఉండగా 2008 నవంబర్ 26న ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్ స్టేషన్‌కు వెళ్లాను. పుణె వెళ్లడానికి నేను, నాన్న, తమ్ముడు ట్రైన్ ఎక్కేందుకు ముంబై చత్రపతి శివాజీ టర్మినల్‌కి వెళ్లాం. ఇంతలో తమ్ముడు బాత్‌రూంకి వెళ్లాలని చెప్పాడు. సరే వెళ్లమని నాన్న చెప్పడంతో తను వెళ్లాడు. ఇంతలో జనాలంతా పెద్దగా అరుస్తూ పరిగెత్తుతున్నారు. పేలుళ్ల చప్పుళ్లు వినిపిస్తున్నాయి. మా నాన్న నా చేయి పట్టుకుని పరిగెత్తారు. ఇంతలో ఓ తుపాకీ శబ్దం. నా కుడి కాలులో బుల్లెట్ దిగింది. దీంతో నేను కింద పడిపోయాను. అటు నంచి ఓ వ్యక్తి నవ్వుకుంటూ ప్రజలను తుపాకీతో కాలుస్తున్నాడు. చూస్తుండగానే నా చుట్టూ ఎంతో మంది కుప్పకూలిపోయారు. రక్తం ఎక్కువగా పోవడంతో స్పృహ కోల్పోయాను. కళ్లు తెరిచేసరికి సెయింట్ జార్జ్ హాస్పిటల్‌లో ఉన్నాను. 6 నెలల్లో ఆరు శస్త్రచికిత్సలు చేసిన తర్వాత నన్ను డిశ్చార్జ్ చేశారు.

26/11

కొన్ని రోజులకు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల మా నాన్నకు ఫోన్ చేశారు. కసబ్‌ను మీ కూతురు గుర్తుపట్టగలదా? అని అడిగారు. నేను సాక్షిగా ఉండేందుకు అంగీకరించాను. కోర్ట్ రూమ్‌కు వెళ్లి కసబ్‌ను గుర్తుపట్టాను. ఆ క్షణం పనితో మా కుటుంబం జీవితం ఒక్కసారిగా మారిపోయింది. కసబ్‌ను గుర్తుపట్టానని తెలిసి మా బంధువులు, స్నేహితులు మా కుటుంబానికి పూర్తిగా దూరమయ్యారు. పాకిస్థాన్ తీవ్రవాదులు ఎప్పటికైనా మమ్మల్ని చంపేస్తారని, మాతో స్నేహం చేస్తే వాళ్లని కూడా చంపేస్తారేమోనని వారంతా భయపడ్డారు.

అయితే కసబ్‌ని నేను గుర్తుపట్టినందుకు అప్పట్లో ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి అంతా ప్రశంసించారు. ఇల్లు ఇస్తామని, మమ్మల్ని అన్నిరకాలుగా ఆదుకుంటామని హామీలిచ్చారు. కానీ హామీలైతే ఇచ్చారు కానీ.. ఇప్పటివరకు ఒక్క సాయం కూడా చేయలేదు. ఎన్నిప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగినా.. ఒక్కరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పటికీ అదే దుస్థితి. నేను ఎవరెవరి చుట్టూ తిరిగానో, వాళ్లేమన్నారో నాకు బాగా గుర్తుంది. టైం వచ్చినప్పుడు అందరి పేర్లూ బయటపెడతాను. నేను, మా అన్నయ్య దివ్యాంగులం. నాన్న వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో మా ఆర్థిక పరస్థితి దయనీయంగా మారింది. అందుకే మాకు రావాల్సిన పరిహారం కోసం హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది` అంటూ దేవిక ఆవేదన వ్యక్తం చేస్తోంది. మరి దేవిక పోరాటం సఫలం అవుతుందా..? ఆమెకు న్యాయం జరుగుతుందా..? ప్రభుత్వాలు ఆమె ఆవేదన చూసైనా సాయం చేస్తాయా..? అనేది వేచి చూడాలి.

Spread the love

1 thought on “26/11 | కసబ్‌ని గుర్తుపట్టిన పాప.. ఇప్పుడు ఎంత దుర్భరంగా బతుకుతోందో తెలుసా..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *