Electric Vehicles | ఫ్యూయెల్ కార్లకంటే ప్రమాదం.. వోల్వో అధ్యయనంలో వెల్లడి

Electric Vehicles

Electric Vehicles

Electric Vehicles

పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రపంచం మొత్తం గో గ్రీన్ అంటూ కర్బన ఉద్కారాలను తగ్గించాలని ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ మొదలైంది.

ఇంధనంతో నడిచే వాహనాలతో పోల్చితే ఎలక్ట్రిక్ వాహనాలు అత్యంత తక్కువగా ఉద్గారాలను వాతావరణంలోకి విడుదల చేస్తాయి. అందువల్ల ఈ-వాహనాలను ఈ మధ్య కాలంలో విపరీతంగా డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా కార్ల విషయంలో అనేకమంది ఎలక్ట్రిక్ కార్ల వైపు ఆసక్తి చూపిస్తున్నారు.

ఎలక్ట్రిక్ కార్ల వల్ల తమ పెట్రోల్, డీజిల్ ఖర్చు తగ్గించుకోవడమే కాకుండా పర్యావరణానికి కూడా ఎంతోకొంత మేలు చేస్తామని అంతా అనుకునేవారు. కానీ ప్రముఖ కార్లు తయారీ సంస్థ వోల్వో తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో ఓ సంచలన విషయాన్ని వెల్లడించింది.

అదేంటంటే.. ఇంధనంతో వాహనాలు కాలుష్యాన్ని కలిగిస్తున్నాయట. మోటారు వాహనాలకంటే ఎలక్ట్రిక్ వాహనాలే ప్రమాదకర ఉద్గారాలను విడుదల చేస్తాయట. ఈ విషయాన్ని ప్రయోగాత్మకంగా తెలుసుకున్నట్లు ఓల్వో కంపెనీ ప్రకటించింది. వోల్వోకు చెందిన ఎక్స్‌సీ40 అనే వాహనం డీజిల్‌తో నడుస్తుంది.

అదే వాహనానికి ఎలక్ట్రిక్ మోడల్ సీ40. అయితే ఎక్స్‌సీ40ని తయారు చేసేపటప్పుడు విడుదలయ్యే ఉద్గారాలకంటే.. ఎలక్ట్రిక్ వేరియంట్‌ సీ40 తయారీలో 70 శాతం అధిక ప్రమాదకరమైన ఉద్గారాలు వెలువడతాయని చెబుతోంది.

అంటే ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్డుపైకి వచ్చిన తర్వాత పర్యావరణానికి మేలు చేస్తాయి కానీ.. తయారీలో మాత్రం కాలుష్యం భారీగా విడుదలవుతుందట. అయితే తయారై రోడ్డుపైకి వచ్చిన తర్వాత మాత్రం ఎలక్ట్రిక్ వాహనాలు దాదాపు ‘0’ ఉద్గారాలను విడుదల చేస్తాయనడంలో సందేహం లేదు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *