China | ఆఫ్ఘనిస్థాన్ బాట పట్టిన డ్రాగన్ కంపెనీలు..


China | డ్రాగన్ కంట్రీ చైనా సంస్థలు ఆఫ్ఘనిస్తాన్ బాట పట్టాయి. ఆఫ్ఘన్ నెలలోని విలువైన ఖనిజాల కోసం ఈ వలస అని సమచారం. ఇందుకోసం చైనాలోని ఐదు సంస్థలు ప్రత్యేక వీసాలతో ఆఫ్ఘన్ చేరుకున్నాయని, తవ్వకాల కోసం స్థలాల తనిఖీని చేపట్టాయని జాతీయ మీడియా రిపోర్ట్ వెల్లడిస్తోంది. దీని ప్రకారం.. ఆఫ్ఘన్ నేలలో దొరికే ట్రిలియన్ డాలర్ల విలువైన ఖనిజాల కోసమే డ్రాగన్ కంట్రి పరితపిస్తోంది.
ఇందుకోసం ఐదు చైనా కంపెనీలు ప్రత్యేక వీసాలతో ఆఫ్ఘన్ చేరుకున్నాయి. చైనా సంస్థలు ముఖ్యంగా లీథియమ్ తవ్వకాలు జరపనున్నాయి. అయితే చైనా కంపెనీలు ఎంత ఆసక్తిగా ఉన్నప్పటికీ కొంతమేరా ఆప్ఘన్‌లోనే ఉండనున్నాయని రిపోర్ట్ వెల్లడిస్తోంది. అయితే ఆప్ఘన్‌లో తనిఖీల కోసం వచ్చిన చైనా కంపెనీలకు ఆప్ఘన్ కమిటీ డైరెక్టర్ యు మింఘుయ్ సహాయకర్తగా వ్యవహరిస్తున్నారు.
చైనా కంపెనీ వారు ఆప్ఘన్‌కు చేరుకున్నారని, వారి తనిఖీలు సైతం అనుకున్న విధంగా సాగుతున్నాయని మింఘుయ్ తెలిపారు. అంతేకాకుండా చైనా కంపెనీలు ఆప్ఘన్‌లో వ్యాపార అవకాశాల కోసం చూడా ప్రయత్నిస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే చైనా తాలిబన్లకు అంతర్జాతీయ భాగస్వాముల్లో ప్రధానంగా మారనుందని ఆగస్టు నెలలో ఓ అంతర్జాతీయ మీడియా తెలిపింది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అది నిజమనే అనిపిస్తోంది.