

America | ప్రపంచ దేశాల కళ్ళన్నీ డ్రాగన్ కంట్రీ పైనే ఉన్నాయి. అది ఎప్పుడు ఏం చేస్తుందో అని అన్ని దేశాలు చూస్తున్నాయి. చైనా కూడా అదే తరహాలో ప్రపంచ దేశాలతో యుద్ధానికి కాలుదువ్వుతోంది.
ఇటీవల తైవాన్ సహా కొన్ని దేశ భూభాగాల్లో తన విమానాలను ఎగరవేసింది. తాజాగా యూఎస్ వార్ షిప్‌కు వార్నింగ్ ఇచ్చింది. అమెరికా వార్ షిప్ సరిహద్దు దాటి చైనా సముద్రంలోకి ప్రవేశించడంతో చైనా తీవ్ర ఆగ్రహం ప్రదర్శించింది.
ఈ విషయంలో అమెరికాకు వార్నింగ్ సైతం ఇచ్చింది. ‘యూఎస్ ఇటువంటి రెచ్చగొట్టే పనులను ఆపాలి. లేకుంటే కఠిన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది.’ అని చైనా మిలటరీ వార్నింగ్ ఇచ్చింది.
దీంతో అన్ని దేశాలు ఆశ్చర్యపోయాయి. మరి ఈ విషయంలో యూఎస్ ఏమని స్పదింస్తుందో చూడాలి.
#China #US #border #Warship