

GST | సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరో షాకిచ్చింది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, వంట నూనె ధరలు పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కాగా.. ఇప్పుడు తీసుకున్న కొత్త నిర్ణయంతో మరింత ఇబ్బందులు పడేలా ఉన్నారు. ముఖ్యంగా ఓలా, ఉబర్ వంటి ట్రాన్స్‌పోర్టేషన్ సంస్థల్లో ఆటో నడుపుకుంటున్న డ్రైవర్లు ఈ నిర్ణయం వల్ల నష్టపోనున్నారు.

ఆన్‌లైన్‌లో జరిగే ఆటో రైడ్ బుకింగ్స్‌పై విధించే జీఎస్టీలో 5 శాతం మినహాయింపు ఇస్తూ వస్తోంది కేంద్రం. డిజిటల్ ఇండియాలో భాగంగా ఇన్నాళ్లూ ఈ విధానాన్ని కేంద్రం పాటించింది. కానీ తాజాగా ఈ మినహాయింపును తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆ 5శాతం జీఎస్టీని ఆటో డ్రైవర్లే చెల్లించాల్సి ఉంటుంది. దీంతో వారి సంపాదనపై ఈ ప్రభావం పడే అవకాశం ఉంది.

ఇక కేంద్రం నిర్ణయాన్ని ఉబర్ ప్రతినిథి తప్పుబట్టారు. ఈనిర్ణయం కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇండియా ఆలోచనకు అడ్డంకి అని, దీనివల్ల ఆటో డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని అన్నారు. కాగా.. కేంద్రం నిర్ణయం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి రానుంది. అంటే అప్పటి నుంచి ఆటో డ్రైవర్లకు లభించే మినహాయింపు లభించదన్నమాట.
#GST #CentralGovt #AutoDrivers #OLA #UBER