

Car Prices | ఒక మంచి ఉద్యోగం, ఇల్లు ఉందంటే.. ఆ తర్వాత మన కన్ను పడేది వాహనం మీదనే. చాలా మంది కొంచెం సెటిలవగానే కారు కొనేస్తారు. కానీ ఇకపై ఇలా చేయాలంటే మరింత ఆలోచించాల్సిన రోజులొస్తాయట. ఈ మాట చెప్పింది ఎవరో కాదు. ఎంజీ మోటార్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రాజీవ్ చాబా. ఎకనామిక్‌టైమ్స్ ఆటో కనెక్టెడ్ వెహికల్ పేరిట జరిగిన వర్చువల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చుల కారణంగా, భారతదేశంలో కార్ల ధరలు క్రమంగా పెరుగుతాయని ఆయన ఊహించారు. ఉత్పత్తి ఖర్చుల భారాన్ని వినియోగదారులపై పడకుండా కంపెనీలు జాగ్రత్తలు పడుతూ వస్తున్నాయని, అందుకే ఈ ధరల పెరుగుదల (Car Prices) ఆలస్యం అవుతోందని చెప్పారు. వచ్చే జనవరి మెుదటి వారం నుండి కార్ల ధరలు పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఈ రంగంలో సంక్షోభ పరిస్థితులు ఉన్నాయని ఆయన తెలిపారు.
ఇది కూడా చదవండి: 26/11 | కసబ్‌ని గుర్తుపట్టిన పాప.. ఇప్పుడు ఎంత దుర్భరంగా బతుకుతోందో తెలుసా..?
ఈ కారణంగా పరిశ్రమలన్నీ కూడా కొత్త తరహా వ్యూహాలను వెతుక్కుంటున్నాయని వివరించారు. మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ సీఈఓ విజయ్ నక్రా కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కారు ధరలు (Car Prices) పెరగడం దాదాపు గ్యారంటీ అన్నట్లు మాట్లాడారు. అయితే ఈ ధరల పెంపుదల ఏ స్థాయిలో ఉంటుందనేది అంచనా వేయడం కష్టమని చెప్పారు. ఆ రేటు ఉత్పత్తి ఖర్చులపై ఆధారపడి ఉంటుందన్నారు.
కాగా, ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మారుతీ సుజుకి ఇప్పటికే ఈ నిర్ణయం తీసేసుకుంది. ఈ ఏడాదిలో జనవరి, జూన్, సెప్టెంబర్‌లలో విడతలవారీగా మూడుసార్లు కార్ల ధరలు పెంచింది.