

50% Tax Cut on Petrol Price | ఇటీవల కాలంలో భారతదేశంలో హాట్ టాపిక్‌గా మారిన సమస్యల్లో పెట్రోధరలు ఒకటి. దీపావళి పండుగ వరకూ ప్రతిరోజూ పెరుగుతూ వచ్చిన ఈ ధరలు సామాన్యుడిపై తీవ్రమైన భారం పెంచాయి.
అలాంటి సమయంలో పన్ను తగ్గించుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పెట్రోలు ధర లీటరుకు రూ.5, డీజిలు ధర లీటరుకు రూ.10 తగ్గింది.
కేంద్రం నిర్ణయాన్ని అనుసరించి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్రో పన్నులను తగ్గించుకున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో పెట్రోలుపై 50 శాతం, డీజిలుపై 40 శాతం వరకూ పన్నులు తగ్గాయి.
ఈ క్రమంలోనే దేశరాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.103.97 అయింది. అదే సమయంలో డీజిలు ధర లీటరు రూ.86.67గా ఉంది. ఆ తర్వాత మళ్లీ పెట్రోలు ధర పెరగకపోవడంతో ఇదే ధర కొనసాగుతూ వస్తోంది.
ఇక్కడి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం తమ వ్యాట్ పన్నులను తగ్గించుకోలేదు. అలాగే దేశ వాణిజ్య రాజధాని ముంబైలో కూడా లీటరు పెట్రోలు రూ. 109.98, డీజిలు రూ.94.14 ధర పలుకుతోంది.
కోల్‌కతాలో కూడా ఇంధన ధరలు నిలకడగానే కొనసాగుతున్నాయి. ఇక్కడ పెట్రోలు ధర రూ.104.67 ఉండగా, డీజిలు ధర రూ.89.79గా ఉంది. చెన్నైలో ఈ ధరలు పెట్రోలు రూ.101.40, డీజిలు రూ.91.43గా ఉన్నాయి.
కేంద్రం ప్రకటన తర్వాత వ్యాట్ తగ్గించుకున్న రాష్ట్రాలు ఇవే..
లడఖ్, కర్ణాటక, పుదుచ్చేరి, జమ్ముకాశ్మీర్, సిక్కిం, మిజోరాం, హిమాచల్ ప్రదేశ్, డామన్ అండ్ డయ్యూ, దాద్రా&నగర్ హవేలీ, చండీగఢ్, అస్సాం, మధ్యప్రదేశ్, త్రిపుర, గుజరాత్, నాగాలాండ్, పంజాబ్, గోవా, మేఘాలయ, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, అండమాన్ అండ్ నికోబార్, బిహార్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హరియాణా. రాజస్థాన్ కూడా వ్యాట్ తగ్గించుకున్నప్పటికీ ఎంత తగ్గించిందీ వెల్లడించలేదు.
వ్యాట్ తగ్గించని రాష్ట్రాలు..
ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర,, ఝార్ఖండ్, తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమబెంగాల్, కేరళ, లక్షద్వీప్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.