Toilet | బాత్‌రూంలో 10 నిముషాలకంటే ఎక్కువ ఉంటున్నారా..? అయితే జాగ్రత్త..!

Toilet

Toilet: బాత్‌రూంలోకి వెళితే చాలు కనీసం గంట గడవకుండా బయటకు రారు కొంతమంది. అలా గంటలుగంటలు బాత్‌రూంలో కూర్చోవడం వల్ల పైల్స్(మొల్లలు) వచ్చే డేంజర్ చాలా ఎక్కువని చెబుతున్నారు డాక్టర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ డాక్టర్ కరణ్. ముఖ్యంగా టాయిలెట్లో ప్రతి ఒక్కరూ చేసే తప్పులను, అందులో పైల్స్‌కు కారణమయ్యే కీలక కారణాలను ఆయన వివరించారు.
డాక్టర్ కరణ్ చెబుతున్నదాని ప్రకారం.. సాధారణ మనుషులు టాయిలెట్‌లో 10 నిముషాకంటే ఎక్కువగా ఉండకూడదు. అంతకంటే ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల.. గుదము భాగంలో ఉండే రక్తం గడ్డకడుతుంది. దీనివల్ల పైల్స్ వచ్చే ప్రమాదం ఉంది.
రెండో పాయింట్‌కి వస్తే.. టాయిలెట్‌లోకి వెళ్లిన తర్వాత కొంతమంది శక్తివంచన లేకుండా ప్రెజర్ పెడతారు. ఇది కూడా శరీరానికి మంచిది కాదని, దీనివల్ల గుదము భాగంలో ఉండే బ్లడ్ వెస్సెల్ టిష్యూస్ డ్యామేజ్ అయి పక్షవాతం కూడా వచ్చే ఛాన్స్ ఉందట. ఇఖ ఫైనల్‌గా ఆహారంలో ఫైబర్ కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. ఇది జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చూస్తుంది.
ఒకవేళ ఫైబర్ అంతగా మన శరీరంలోకి వెళ్లకపోతే అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఇక పైన చెప్పిన తప్పుల్లో చాలా మంది కనీసం 2 తప్పులు చేస్తుంటారు. అలాంటి వాళ్లు తమ తప్పును తెలుసుకుని వెంటనే మార్చుకుంటే పైల్స్ సమస్య రాకుండా జీవించవచ్చు.