

Alternatives for Increase in Sex Drive | కొత్తగా పెళ్లయిన జంటకు మంచి మూడ్ రావడం కోసం మల్లెపూలే ఎక్కువగా వాడుతుంటారు. సినిమాల్లో కూడా ఇదే విషయాన్ని చూపిస్తుంటారు. దక్షిణాది అమ్మాయిలకు, ముఖ్యంగా మన తెలుగు ఆడపిల్లలకు మల్లెపూలంటే మక్కువ ఎక్కువ. ఇవన్నీ చూసి మూడ్ రావాలంటే మల్లెపూలు గ్యారంటీనా? అనుమానం రావడం కూడా గ్యారంటీనే. అయితే అసలు మల్లెపూలు ఎందుకు వాడతారో తెలుసా? ఇవి ఉంటే ప్రత్యేకంగా, సెంటో లేదంటే పెర్‌ఫ్యూమో వాడాల్సిన అవసరం ఉండదు. వాటి ఘుమఘుమ అలాంటిది మరి.
కానీ ఈరోజుల్లో ఇలా పూలు దొరకడం కష్టంగా మారింది. మరీ సిటీల్లో అయితేక భార్య కోసం మల్లెపూలు తీసుకెళ్దామని వెళ్తే.. ఉన్న ఓపిక నశించిపోవడమే కానీ మంచి మల్లెలు దొరకడం మాత్రం జరగదు. ఇలాంటి పరిస్థితుల్లో మల్లెపూలకు ఇతర ప్రత్యామ్నాయాల వైపు ఓ లుక్కేస్తే సరిపోతుంది. అంతేకాదు కొందరికి మల్లెపూల వాసన కూడా పడదు. తలనొప్పి వచ్చేస్తుంది. అలాంటి వారికి కూడా ఈ ప్రత్యామ్నాయాలు చాలా ఉపయోగపడతాయి. మరెందుకాలస్యం ఆ ప్రత్యామ్నాయాలేంటో ఒకసారి చూసేద్దామా?
దాల్చిన చెక్క:
వంటింట్లో దొరికే ఇది మల్లెపూలకు మంచి ప్రత్యామ్నాయం. పసుపుతో దీన్ని కలిపితే వచ్చే వాసన మన నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఈ వ్యవస్థకు రక్త ప్రసరణను పెంచుతుంది. దాల్చిన చెక్క నూనెను కొంచెం తీసుకుని గొంతు మీద, చెవుల వెనుక రాసుకుంటే చాలు.. ఆ వాసనే మనలో ఉత్తేజాన్ని నింపుతుంది.
వెనీలా:
ఈ వాసన ఇష్టంలేని వ్యక్తులు ఎవరుంటారు? అందుకే ఐస్‌క్రీమ్స్‌లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. వెనీలా సువాసన మన శరీరాన్ని తేలికగా చేస్తుంది. మనస్సు మరింత తేలిగ్గా ఉంటుంది. సాధారణంగా ఈ పెర్‌ఫ్యూమ్ వాడితే దంపతుల మధ్య సెక్స్ మూడ్ పెరుగుతుందట. అందుకే పురుషులు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారట.
పిప్పరమింట్:
పురుషులకు వెనీలా వాసన ఎలా మూడ్ తెస్తుందో.. అమ్మాయిలకు పిప్పరమెంటు వాసన అలాంటిదన్నమాట. ఈ వాసన చూసిన అమ్మాయిలకు మంచి మంచి కోరికలు కలుగుతాయట. ఈ సువాసన అమ్మాయిల్లో ఉద్రేకాన్ని పెంచుతుంది. సెక్స్ సమయంలో వాళ్లు భావప్రాప్తి పొందడానికి కూడా ఈ సువాసన చాలా ఉపయోగపడుతుందట.
చందనం:
గంధపు నూనెతో మసాజ్ చేసుకుంటే, అది మన శరీరంలో సెక్స్ సెన్స్‌ను బాగా పెంచుతుంది. ఇది మనలో లైంగిక కోరికలను ప్రేరేపిస్తుంది. అందుకే మన పెద్దలు శోభనం (తొలిరాత్రి) రోజు వధూవరుల బుగ్గలకు గంధాన్ని రాసేది.
లావెండర్:
సెక్స్ చేసే సమయంలో కొందరికి దడ పుడుతుంది. అలాంటి పరిస్థితి తలెత్తకూడదంటే.. కనురెప్పల మీద కొద్దిగా లావెండర్ నూనె రాసుకోవాలి. ఈ ఆయిల్ మోతాదు ఎక్కువ కాకుండా జాగ్రత్త పడాలి. లావెండర్ వాసన మన మూడ్‌ను బాగా ప్రేరేపించడమే కాకుండా.. సెక్స్ డ్రైవ్ సాఫీగా సాగేందుకు దోహదపడుతుంది.
గులాబీలు:
ప్రేమను వ్యక్తం చేసేందుకు సింబల్‌గా మారిన గులాబీలు.. మల్లెపూల కంటే ఎక్కువ సేపు సెక్స్ డ్రైవ్ కలిగి ఉండేలా చేస్తాయట. అందుకేనేమో ప్రియురాలికి బొకేలు ఇచ్చేటప్పుడు ఎక్కువగా గులాబీలనే ఎక్కువ మంది సిఫారసు చేస్తారు. గులాబీ రేకలను పిండి, వచ్చిన రసాన్ని శరీరానికి రాసుకుంటే మంచి వాసన వస్తుంది.
అంతేకాదు ఈ సహజసిద్ధమైన సువాసన మన శరీర చెమటతో కలిసినప్పుడు భాగస్వామిలో మరిన్ని కోరికలను రగిలిస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఛాన్స్ చూసి వీటిలో ఏదో ఒకటి ట్రై చేయండం. మీ సెక్స్ లైఫ్‌లో కొత్తదనాన్ని నింపండి.