

కొంచెం చేదుగా, కొంచెం తీయగా ఉంటూ గొంతులోకి పోగానే హుషారిచ్చే కాఫీ(Coffee)కి అందరూ బానిసలే. ఉద్యోగాలు చేస్తున్నా.. ఇంట్లో ఉన్నా.. మిత్రులను కలిసినా.. పైఅధికారిని కలిసినా.. చాలా మంది కాఫీతోనే పలకరించుకుంటారు. ఈ కాఫీ పలకరింపు మనలో చాలామందికి బాగా అలవాటే. కానీ కాఫీ ఎక్కువగా తీసుకుంటే మన శరీరానికి ఎంత హాని జరుగుతుందో తెలుసా?
Smoking | స్మోకింగ్ వదిలేస్తే 3 రోజుల్లో పిచ్చి పడుతుందా..?
ఆ.. కప్పు కాఫీ తాగితే ఏం నష్టం? అని అనుకుంటున్నారా? అయితే ఇది చదవాల్సిందే. రోజుకు ఒకటి లేదా రెండు కప్పులు కాఫీ (Coffee) తాగితే ప్రాబ్లం ఉండదు. కానీ విపరీతమైన అలవాటుతో మరీ ఎక్కువగా తాగమనుకో మన బుర్ర సైజు తగ్గిపోతుందట. నిజమండీ ఈ విషయాన్ని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియాలోని సెంటర్ ఫర్ ప్రెసిషన్ హెల్త్‌కు చెందిన పరిశోధకులు చెప్పారు.
అంతేకాదు, కాఫీ ఎక్కువగా తాగే వారికి డిమెన్షియా (మతిమరుపు) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందట. గుండెపోటు వంటి సమస్యలు కూడా పొంచి ఉంటాయట. కాఫీ (Coffee)లో ఉండే కెఫీన్ ఉత్తేజాన్ని ఇస్తుందని తెలుసు. కానీ అదే మన ఆరోగ్యానికి చాలా హాని కూడా చేస్తుందని పరిశోధకులు చెప్తున్నారు. ఇది మన మెదడులో రక్త సరఫరాను తగ్గిస్తుందట.
Danger Diseases | ముదిరితేకానీ తెలియవు.. ఈ వ్యాధుల గురించి తెలుసా?
ముఖ్యంగా జ్ఞాపక శక్తికి సంబంధించిన మెమరీ సర్క్యూట్స్‌పై బాగా ప్రభావం చూపుతందట. దీని వల్ల ‘న్యూరో డీజనరేషన్’ జరిగే ప్రమాదం ఉంది. అందుకే కాఫీలు ఎక్కువగా తాగితే మతిమరుపు, ఆలోచనా లోపం వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. కాబట్టి కాఫీ (Coffee) ఎంత అలవాటున్నా రోజుకు రెండు, మహా అయితే మూడు కప్పులకు మించి తాగొద్దని హెచ్చరిస్తున్నారు.