
Spices: Top view of a black bowl filled with cardamom pods shot on abstract brown rustic table. A wooden serving scoop is beside the bowl and cardamom pods are scattered on the table. Useful copy space available for text and/or logo. Predominant colors are green and brown. Low key DSRL studio photo taken with Canon EOS 5D Mk II and Canon EF 100mm f/2.8L Macro IS USM.

Cardamon | మనందరికీ యాలకులు బాగా తెలుసు. పండుగల పూట చేసుకునే పాయసం మొదలు చాలా ఆహార పదార్థాల్లో యాలకులు వేయాల్సిందే. వీటిని ఎన్నో తరాలుగా సుగంధ ద్రవ్యాలుగా వాడుతూనే ఉన్నారు. ఈ మొక్క సిటామినేసి కుటుంబానికి చెందింది. వీటిలో రెండు రకాలుంటాయి. పచ్చ యాలకులు, నల్ల యాలకులు. పచ్చ వాటి సైంటిఫిక్ పేరు ఇలటేరియా కార్డిమమ్. నల్ల వాటి పేరు అమెమం.
మనం ఎక్కువగా వాడేది పచ్చ యలకులనే. ఈ యాలకులతో ఎంత ఆరోగ్యమో తెలుసా? వీటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కారణంగానే ఆయుర్వేదంలో వీటిని బాగా వాడతారు. ఇవి శరీరానికి చాలా చలువ. మన శరీరంలో ఉండే వ్యర్ధాలను తొలగించడంలో యాలకులు (Cardamon) బాగా ఉపయోగపడతాయి. నోటి దుర్వాసనను కూడా దూరం చేస్తాయి.
అంతేకాదు ఈ యాలకులతో మరెన్నో ఉపయోగాలున్నాయి. అవేంటో ఒకసారి చూసేద్దామా? మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేయడంలో యాలకులు చాలా హెల్ప్ చేస్తాయి. జీర్ణ ప్రక్రియకు అవసరమైన ఎంజైమ్స్ ఉత్పత్తిని ఇది ప్రేరేపిస్తుంది. అంటే యాలకుల వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్దకం వంటి అనేక జీర్ణ సంబంధ సమస్యలు మన దరిచేరవు.
Gastric Problem | గ్యాస్ సమస్యా?.. ఈ లక్షణాలు ఉన్నాయేమో చూసుకోండి!
మనకు చాలా సార్లు కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో ఒక యాలక్కాయను (Cardamon) నోట్లో వేసుకొని నమిలితే ఆ ఉబ్బరం తగ్గిపోతుందట. యాలకుల్లో పొటాషియం, క్యాల్షియం, మెగ్నిషీయం,ఎలక్ట్రోలైట్లు వంటివి పుష్కలంగా దొరుకుతాయి. ఇవి మన గుండెకు చాలా మేలు చేస్తాయి. యాలకుల వల్ల గుండె పనితీరును మరింత మెరుగవడం, రక్త సరఫరా బాగా జరగటం వంటి ఉపయోగాలుంటాయి. వీటి వల్ల రక్తపోటు కూడా మన అదుపులోనే ఉంటుంది.
మన రక్తంలో కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో కూడా యాలకులు బాగా ఉపయోగపడతాయి. అంతేకాదు, మనం ఎప్పుడైనా డిప్రెషన్‌లో ఉన్నామనుకోండి.. అలాంటి సమయంలో ఒక యాలక్కాయను నోట్లో వేసుకోవాలి. ఇది మనల్ని డిప్రెషన్ నుంచి బయటపడేస్తుంది. కావాలంటే యాలకుల టీ కూడా తాగొచ్చు. గురక పెడుతున్నా, దగ్గు వస్తున్నా, శ్వాస సరిగా ఆడకపోయినా యాలకులు (Cardamon) చక్కగా పనిచేస్తాయి. ఆస్తమా తగ్గించడంలో కూడా ఇవి చాలా సహాయకారిగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు.
Danger Fruits | ఈ పండ్లను కలిపి తింటే డేంజర్.. ఒకసారి చెక్ చేసుకోండి!
సరిగా నిద్ర పట్టక ఇబ్బంది పడే వాళ్లకు కూడా యాలకులే ఔషధం. నిద్రలేమి సమస్యతో బాధపడే వాళ్లు.. ఒక రెండు యాలకులను మెత్తగా దంచి నీటిలో మరిగించి వడకట్టుకోవాలి. వెచ్చగా ఉన్నప్పుడే ఈ నీళ్లనే తాగేయాలి. రాత్రి నిద్రపోవడానికి ఒక అరగంట ముందు ఇవి తాగాలి. ఒక వారం పాటు ఈ పద్ధతి ఫాలో అయితే మంచి నిద్ర పట్టి, నిద్రలేమి దూరమవుతుంది. అలాగే యాలకులను (Cardamon) వేయించి, దంచి పొడిగా దాచుకొని కూడా ఉపయోగించుకోవచ్చు.