

కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. తన భర్తను చంపేశానంటూ ఓ మహిళ పోలీసులకు లొంగిపోయింది. తన భర్త ప్రవర్తనను తట్టుకోలేకనే అలా చేయాల్సి వచ్చిందని ఆమె తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆ మహిళకు అక్కడే నివసించే పలార్ స్వామి(50)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆమెను అతడు పెళ్లి కూడా చేసుకున్నాడు. పలార్ స్వామికి కూడా ఇదివరకే పెళ్లయింది. కానీ ఈమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. తన రెండో భార్యకు దాదాపు రూ.6 కోట్ల ఖర్చుపెట్టి ఓ ఇల్లు కూడా నిర్మించాడు.
అయితే అంతా బాగానే ఉన్నా ఒక్కసారిగా ఆమె తన పలార్ స్వామిని చంపేసింది. అనంతరం పోలీసులకు లొంగిపోయింది. తన భర్త తనను వేరే వాళ్ల వద్దకు వెళ్లాలని, వారితో గడపమని ఇబ్బంది పెడుతున్నాడని, అది తట్టుకోలేకనే అతడిని చంపేశానని ఆమె తెలిపింది. అయితే ఇంతలో అతడి మొదటి భార్త ఎంట్రీ ఇచ్చిన.. తనని తన పిల్లలని బాగా చూసుకుంటుంన్నాడనే ఆమె అలా చేసిందని మరో కేసు నమోదు చేసింది. రెండు కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.