

ప్రపంచంలో అన్నింటికన్నా గొప్పది తల్లి ప్రేమ. దీనిని ఎంతటి నాస్థికుడైన ఒప్పుకుంటారు. అన్నింటికన్నా స్వచ్ఛమైంది, నిర్మలమైంది తల్లి ప్రేమే అన్నది జగమెరిగిన సత్యం. అటువంటి తల్లి ఎవరూ కూడా వదులుకునేందుకు ఇష్టపడరు. కానీ కాలం మాత్రం ఎటువంటి దయ లేకుండా బిడ్డకు తల్లిని దూరం చేస్తుంది. ఆ తరువాత పిల్లలు తన తల్లి జ్ఞాపకాలతో గడుపుతుంటారు.
అయితే ఇటీవల ఓ తనయుడు మాత్రం తన తల్లి వెంటే వెళ్లిపోయాడు. తల్లి మరణించి కొద్ది సమయానికే కుమారుడు కూడా తిరిగిరాని లోకాలకు వెళ్ళి పోయాడు. తల్లి అంత్యక్రియలకు చేసేందుకు వెళుతూనే తనయుడు తనువు చాలించాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కసాబ్ గల్లీలో చోటుచేసుకుంది. తల్లి అనారోగ్యంతో దిపావళి పర్వదినాన కన్నుమూసింది.
ఆమె అంత్యక్రియల కోసం వెళుతుండగా ఆమె కుమారుడు శ్రీనివాస్‌కు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దాంతో అతడు అక్కడే సృహ తప్పి పడిపోయాడు. వెంటనే అతడిని హాస్పటల్‌కి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషాద ఘటన కుంటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచేసింది.