

ఈ మధ్య ప్రతి ఒక్కరూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్లు Model కావచ్చు లేదా సామన్యులు కావచ్చు. కొందరు డబ్బు కోసం ఎంతదూరమైనా వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. డబ్బు వస్తుంది అంటే ఏపైనైనా, ఎవరినైనా ఆడుకునేందుకు సిద్దమవుతున్నారు. చిన్నపెద్ద తేడా లేకుండా ఎదుటివారి అవసరాలను తమకు అనుగుణంగా మార్చుకుంటూ వారు ఈ ఘాతుకాలకు పాల్పడుతున్నారు. ఈ తరహాలోనే ఇటీవల ఓ దారుణం చోటుచేసుకుంది.
Model ను కూడా వదలకుండా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. స్క్రీన్ టెస్ట్ ఉందని పిలిచి రహస్యంగా వీడియోలు చిత్రీకరించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ముందుగా సినీ పరిశ్రమలోని తనకు తెలిసిన వారు చాలా మంది ఉన్నారంటూ రియా వర్మ అనే యువతి బాధితురాలికి పరిచయం అయింది. ఆ తరువాత స్క్రీన్ టెస్ట్ ఉందని గెస్ట్ హౌస్‌కు పిలిచారు.
అక్కడి వెళ్లిన తరువాత ఓ డ్రెస్ ఇచ్చి మార్చుకోమని అన్నారు. ఈ సమయంలో రహస్యంగా వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేశారు. అంతేకాకుండా కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి తనను నగ్నంగా వీడియోలు తీశారని, ఇప్పుడు అశ్లీల వీడియోల నటించమని అడుగుతున్నారని చెప్పింది.
లేకుంటే ఆ వీడియోలను నెట్‌లో పెడతామని వారు బెదిరించారని, అందుకు నిరాకరించడంతో ఇప్పుడు రూ.5 లక్షలు కావాలని డిమాండ్ చేస్తున్నారని బాధితురాలు పేర్కొంది. ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు పలు సెక్షన్లలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.