Girl got gang Raped | స్నేహితురాలితో ఊరికి.. ఆ తరువాత రోడ్డుపై దొరికిన యువతి..


మనకి ప్రతి రోజు రోడ్డు పక్కన పడుకొని ఎందరో కనిపిస్తుంటారు. వారంతా జీవనోపాధి కోసం వచ్చినవారో, జీవించడానికి షల్టర్ లేని వారే అయ్యంటారు. ఇలాంటి వారిని పోలీసులు కూడా చూస్తూనే ఉంటారు. వీరిలో ఎక్కువ మంది మగవారే కనిపిస్తుంటారు. ఆడవారు ఉన్నా ముసలి వారు, లేదంటే రోడ్డుపైనే జీవనం సాగించే కుంటుంబాల బాలికలు ఉంటారు. అయితే 23 ఏళ్ల యువతి రోడ్డు పక్కన పడి ఉంది. ఆమెను చూసిన పోలీసులు ఒంకింత ఆశ్చర్యపోయినా ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అక్కడ అసలు కథ బయట పడింది. ఆమెను కొందరు కామాంధులు గ్యాంగ్ రేస్ చేశారని చెప్పింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇదంతా రాజస్థాన్‌లో జరిగింది. పూర్తి వివరాళ్లోకి వెళితే.. 23ఏళ్ల యువతి తన స్నేహితురాలితో కలిసి జైపూర్ ఛుంగీ ప్రాంతానికి వచ్చారు. అక్కడి నుంచి ఆమె స్నేహితురాలి బాయ్ ఫ్రెండ్, స్నేహితురాలు ఆమెను దౌసా అనే ప్రాంతానికి తీసుకొచ్చారు. అక్కడ అతడి ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు. వారంతా కలిసి ఆమెకు మద్యం తాగించారు.
అంతే ఆ తరువాత మరో స్నేహితుడు కూడా వచ్చాడు. వారంతా కలిసి ఆమెను గ్యాంగ్ రేప్ చేశారని బాధితురాలు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. అంతేకాకుండా ఆమె స్నేహితురాలిని ప్రశ్నిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టకుంటామని రౌసా ఎస్పీ అనిల్ బెనీవాల్ తెలిపారు.