Warning: sprintf(): Too few arguments in /home/ff4q68c69pqk/public_html/wp-content/themes/covernews/lib/breadcrumb-trail/inc/breadcrumbs.php on line 253

Fire accident | విశాఖ నేల వేషాల్లో దారుణం.. అలా చేస్తుంటే..

Fire accident | విశాఖ పట్నంలో దారుణం చోటుచేసుకుంది. నాగుల చవితి సందర్భంగా నిర్వహించిన నేలవేషాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. మంటతో ఫీట్స్ చేస్తున్న కళాకారుడిని ఆ మంటలే..

Spread the love
Fire accident
Fire accident

విశాఖ పట్నంలో దారుణం చోటుచేసుకుంది. నాగుల చవితి సందర్భంగా నిర్వహించిన నేలవేషాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. మంటతో ఫీట్స్ చేస్తున్న కళాకారుడిని ఆ మంటలే ముంచేశాయి. ఈ ఘటన విశాఖపట్నం యలమంచిలలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నేలవేషాల సందర్భంగా సంతోష్ అనే వ్యక్తి ఫైర్ బ్రీత్‌ను ప్రదర్శిస్తున్నాడు. డీజిల్‌ను నోట్లో పోసుకొని అతడు ఈ ఫీట్ చేస్తున్నాడు. అయితే ఒక్కసారిగా గాలి ఎదురురావడంతో మంటలు అతడిపైకే వచ్చాయి. దాంతో అతడు ప్రమాదానికి గురయ్యాడు. అతడికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. సంతోష్ ప్రస్తుతం కాలిన గాయాలకు చికిత్స అందుకుంటున్నాడు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *