selfie Suicide | బావ వేధింపులు భరించలేక ఆత్మహత్య.. సెల్ఫీ వీడియోతో..

selfie Suicide

selfie Suicide

selfie Suicide

selfie Suicide | లైంగిక వేధింపులకు ఓ నిండుప్రాణం బలైంది. బాధితురాలు చనిపోయే ముందు తన చావుకు కారణం ఎవరో చెబుతూ ఓ వీడియోను కూడా తీసింది. ఆ వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది.

ఈ విషాద ఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాపువాడలో నివాసం ఉండే ఓ మహిళ చాలాకాలంగా లైంగిక వేధింపులకు గురవుతోంది. తన బావ కనకయ్యే ఆమెను ఈ వేధింపులకు గురి చేస్తున్నాడు.

గత కొంతకాలంగా అతడి వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. అతడి బాధ భరించలేక.. బాధితురాలు గురువారం ఫ్యానుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది.

అయితే చనిపోయే ముందు తన చావుకు కనకయ్యే కారణమని సెల్ఫీ వీడియో తీసి కన్నీరు పెట్టుకుంది. అతడి బాధ భరించలేకే ప్రాణాలు తీసుకుంటున్నానని ఆ వీడియోలో పేర్కొంది.

ఈ వీడియోలో బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె భర్త ఇంట్లో లేని సమయంలో కనకయ్య వచ్చి వేధింపులకు గురి చేస్తున్నాడు. పిల్లలకు తప్పుగా చెబుతానని బెదిరించేవాడు.

కాగా, తాను కష్టపడి మిషన్‌ కుట్టుకుంటూ తన పిల్లలను పోషించుకుంటున్నానని, కానీ కనకయ్య పెడుతున్న బాధను భరించలేకే ప్రాణాలు తీసుకుంటున్నానని తెలిపింది.

అలాగే పిల్లలు ఎవరిజోలికి పోకుండా జాగ్రత్తగా బతకాలని, అదే తన కోరికని చివరి మాటగా అరుణ​ సెల్ఫీ వీడియో తెలిపింది. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంది. ఈ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.

#Woman #CrimeNews #Crime #SelfieVideo #Suicide #Karimnagar #selfieSuicide

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *