

Tamilnadu | 2020లో తమిళనాడులోని గ్రామంలో అదృశ్యమైన అమ్మాయిని పోలీసులు కనిపెట్టారు. ఇన్నాళ్లు దాదాపు 5 రాష్ట్రాలు జల్లెడ వేసి మరీ అమ్మాయి ఆచూకీ తెలుసుకున్నారు. అమ్మాయి కోసం పోలీసులు పడ్డ శ్రమకు ఫలితం దక్కింది.
17 ఏళ్ల అమ్మాయి తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయిన 35 ఏళ్ల వ్యక్తితో కలిసి నివసిస్తోంది. అమ్మాయిని, అతడిని కనుగొనేందుకు పోలీసలు దాదాపు 40 సీసీ కెమెరాల రికార్డింగ్‌ను పరీక్షించారు.
అయితే ఎట్టకేలకు అమ్మాయి జాడ తెలిసిందని, అమ్మాయి ఇటీవల 3 నెలల క్రితం చిన్నారికి జన్మనిచ్చిందని పోలీసులు తెలిపారు.
#missing girl #Tamilnadu #Police